Prabhas : విదేశాల్లో ప్రభాస్.. కాలుకు సర్జరీ.. అసలు విషయం చెప్పిన అశ్వినీదత్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న సినిమాలని భారీ బడ్జెట్ సినిమాలే .. రీసెంట్ గా వచ్చిన రాధేశ్యామ్ సినిమా ప్రేక్షకులను నిరాశపరచడంతో ఇప్పుడు ప్రభాస్ ఆప్ కింగ్ సినిమాల పై ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Prabhas : విదేశాల్లో ప్రభాస్.. కాలుకు సర్జరీ.. అసలు విషయం చెప్పిన అశ్వినీదత్
Prabhas
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 29, 2022 | 8:32 AM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas )నటిస్తోన్న సినిమాలని భారీ బడ్జెట్ సినిమాలే .. రీసెంట్ గా వచ్చిన రాధేశ్యామ్ సినిమా ప్రేక్షకులను నిరాశపరచడంతో ఇప్పుడు ప్రభాస్ ఆప్ కింగ్ సినిమాల పై ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వరుస సినిమాలను లైనప్ చేసిన డార్లింగ్ ఆయా సినిమాల షూటింగ్స్‌తో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం ప్రభాస్, ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే, మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. తాజాగా ప్రభాస్ గురించి ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ ఆసక్తికర విషయాన్నీ చెప్పుకొచ్చారు. అశ్వినీదత్ చెప్పిన ఆ విషయం తో ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త ఆందోళనకు గురవుతున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ సీతారామం అనే సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కు ప్రభాస్ ముఖ్య అతిథిగా హాజరుకావాల్సి ఉందట..

అయితే ప్రభాస్ ఈ ఈవెంట్ కు రావడం కుదరడం లేదని తెలిపారు అశ్వినీదత్ . ప్రభాస్ కాలికి చిన్న సర్జరీ జరుగుతుందట. ఇందుకోసం ఆయన విదేశాలకు వెళ్లాడని తెలిపారు. కాలి సర్జరీ కోసం విదేశంలో ఉండటంతో సీతారామం ఈవెంట్ కు రాలేకపోయాడు అని చెప్పుకొచ్చారు. అయితే ప్రభాస్‌కు గతంలోనూ సర్జరీ జరిగినట్లు వార్తలు విచ్చిన విషయం తెలిసిందే!అలాగే ప్రాజెక్ట్ కే గురించి మాట్లాడుతూ.. ప్రాజెక్ట్ కే షూటింగ్ జనవరికి పూర్తవుతుంది. తర్వాత గ్రాఫిక్స్ వర్క్ వుంటుంది అన్నారు. నాగచైనత్య సినిమా, శ్రీకాంత్ గారి అబ్బాయి రోషన్ తో ఒక సినిమా చర్చల్లో వున్నాయి. అన్నీ మంచి శకునములే అక్టోబర్ 5న విడుదలౌతుందని తెలిపారు అశ్వినీదత్.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..