AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aswani Dutt: ‘అందుకే సినిమాలపై ప్రేక్షకుల్లో విరక్తి కలిగింది’.. అశ్వినీదత్ సంచలన వ్యాఖ్యలు

ఆగస్టు 1 నుంచి సినిమా షూటింగ్ లను నిలిపివేయాలని ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. సినిమా నిర్మాణానికి బడ్జెట్ పరిగిపోవడంతో ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఈ నిర్ణయం తీసుకుంది

Aswani Dutt: 'అందుకే సినిమాలపై ప్రేక్షకుల్లో విరక్తి కలిగింది'.. అశ్వినీదత్ సంచలన వ్యాఖ్యలు
Ashwini Dutt
Rajeev Rayala
|

Updated on: Jul 28, 2022 | 8:49 PM

Share

Aswani Dutt: ఆగస్టు 1 నుంచి సినిమా షూటింగ్ లను నిలిపివేయాలని ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. సినిమా నిర్మాణానికి బడ్జెట్ పరిగిపోవడంతో ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయం పై పై ప్రముఖ నిర్మాత అశ్వినిదత్ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్స్ గిల్డ్ అశ్వినీదత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రేక్షకులు థియేటర్స్ కు రాకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. అలాగే టికెట్ రేట్లు ఒక క్రమ పద్దతి లేకుండా పెంచడం, తగ్గించడం కూడా ఒక కారణం కావొచ్చు. అలాగే చాలా థియేటర్లని చేతిలోకి తీసుకొని స్నాక్స్, కూల్ డ్రింక్స్ ధరలు ఇష్టారాజ్యంగా పెంచి ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ కి రావాలంటే భయపడే స్థాయికి తీసుకెళ్ళారు. ఇదే సమయంలో ఓటీటీలు వచ్చాయి అన్నారు అశ్వినీదత్.

నిర్మాతల శ్రేయస్సు కోసమే అప్పట్లో ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఏర్పాటైంది. ఇప్పుడు ప్రొడ్యూసర్ గిల్డ్ ఎందుకు వచ్చిందో తెలియడం లేదు అన్నారు. థియేటర్ కు ప్రేక్షకులను రప్పించడం ఇప్పుడు దర్శక నిర్మాతలకు సవాల్ గా మారింది. ముఖ్యమంత్రుల దగ్గరకు వెళ్లి టికెట్ ధరలు పెంచుకోవడమే ప్రస్తుత పరిస్థితికి కారణం. ధరలు తగ్గించామని ఓసారి, పెంచామని మరోసారి చెప్పడం వల్లే సినిమాలపై ప్రేక్షకుల్లో విరక్తి కలిగింది. టికెట్ ధరలు పెంచిన వాళ్లే ఇప్పుడు షూటింగ్స్ బంద్ అంటూ ఆందోళన చేస్తున్నారు. అలాగే ఇష్టం వచ్చినట్లు హీరోలకు పారితోషకాలు ఇస్తున్నారనడం సరికాదు. మార్కెట్ ధర ప్రకారమే హీరోలు పారితోషకాలు తీసుకుంటారు. చిత్ర పరిశ్రమలో సమస్యలొస్తే గతంలో ఎన్టీఆర్, నాగేశ్వర్ రావు లాంటి హీరోలు రాలేదు . .ఏదైనా సమస్యలుంటే ఫిల్మ్ చాంబరే పరిష్కరించేది. ఇప్పుడున్న నిర్మాతల్లో స్థిరత్వం లేదు. హీరోల పారితోషకాల వల్లే సినిమా టికెట్ ధరలు పెంచారనేది అవాస్తవం అన్నారు అశ్వినీదత్

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి