Prabhas : రామమందిరంకు ప్రభాస్ 50కోట్లు విరాళం.. క్లారిటీ ఇచ్చిన టీమ్
దేశంలోని ప్రతి భక్తుడు రామమందిరంలో శ్రీరాముని బాల రూపమైన రామ లల్లాను దర్శించుకోవాలని కోరుకుంటారు. రామమందిర నిర్మాణానికి అనుమతినిస్తూ సుప్రీంకోర్టు నవంబర్ 9, 2019న ఉత్తర్వులు ఇచ్చింది. ఇందుకోసం ట్రస్టును ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆగస్ట్ 5, 2020న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రామమందిర నిర్మాణానికి భూమిపూజ చేశారు.

అయోధ్యలోని అద్భుతమైన రామమందిరం త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో దేశమంతా రామభక్తిలో మునిగిపోయి అయోధ్యపై దృష్టి సారించింది. దేశంలోని ప్రతి భక్తుడు రామమందిరంలో శ్రీరాముని బాల రూపమైన రామ లల్లాను దర్శించుకోవాలని కోరుకుంటారు. రామమందిర నిర్మాణానికి అనుమతినిస్తూ సుప్రీంకోర్టు నవంబర్ 9, 2019న ఉత్తర్వులు ఇచ్చింది. ఇందుకోసం ట్రస్టును ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆగస్ట్ 5, 2020న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రామమందిర నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఆ తర్వాత ఆలయ నిర్మాణం శరవేగంగా జరిగింది. ఇక ఈ నెల 22న ఘనంగా రామమందిరం ప్రారంభోత్సవం జరగనుంది.
రామమందిరం ప్రారంభోత్సవానికి చాలా మందికి ఆహ్వానం అందింది. పలువురు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సినీ నటుల పేర్లు ఆహ్వాన జాబితాలో ఉన్నాయి. ఆహ్వాన పత్రికకు సంబంధించిన ఫోటో ఇప్పటికే వైరల్‌గా మారింది. మన టాలీవుడ్ నుంచి రెబల్ స్టార్ ప్రభాస్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం అందింది. ఇదిలా ఉంటే ప్రభాస్ రామమందిరం కోసం భారీగా విరాళం ఇచ్చాడంటూ ప్రచారం జరుగుతోంది. ఏకంగా ప్రభాస్ 50 కోట్ల వరకు రామమందిరం కు విరాళం ఇచ్చాడంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ప్రభాస్ రామమందిరం ప్రారంభోత్సవానికి వచ్చే భక్తులకు ఆహార ఏర్పాట్లు చేస్తున్నాడని అందుకు దాదాపు 50 కోట్లవరకు ఖర్చు చేస్తున్నాడంటూ వార్తలు షికారు చేస్తున్నాయి. తాజాగా దీని పై ప్రభాస్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఇటీవలే ఓ మీడియా సంస్థ ప్రభాస్ టీమ్ ను సంప్రదించగా..రామమందిరం ప్రారంభోత్సవానికి వచ్చే భక్తులకు ప్రభాస్ భోజన ఏర్పాట్లు చేయడానికి కోట్ల రూపాయిలు ఇచ్చారు అన్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని క్లారిటీ ఇచారు. అవన్నీ రూమర్స్ మాత్రమేనని చెప్పుకొచ్చింది ప్రభాస్ టీమ్. ప్రభాస్ సినిమాల విషయానికొస్తే ఇటీవలే సలార్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న డార్లింగ్ ఇప్పుడు రాజా సాబ్, కల్కి సినిమాలతో బిజీగా ఉన్నాడు.
ప్రభాస్ ఇన్ స్టా గ్రామ్..
View this post on Instagram
ప్రభాస్ ఇన్ స్టా గ్రామ్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
