Prabhas: ఆ హీరోయిన్ యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం.. కానీ హైట్ ప్రాబ్లమ్.. ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
కేజీఎఫ్ సినిమాతో సంచలన విజయం సాధించిన ప్రశాంత్ నీల్ సలార్ సినిమాతో మరో హిట్ అందుకున్నారు. సలార్ సినిమా కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఈ సినిమాను రెండు పార్ట్ లుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక సలార్ సినిమా ఏకంగా 700కోట్ల వరకు వసూల్ చేసింది. ఇక ఇప్పుడు సలార్ పార్ట్ 2 తో పాటు కల్కి, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నారు ప్రభాస్.

దాదాపు ఆరేళ్ళ తర్వాత ప్రభాస్ సాలిడ్ హిట్ అందుకున్నారు. వరుసగా ఫ్లాప్స్‌తో సతమతం అయిన ప్రభాస్.. సలార్ సినిమాతో సంచలన విజయం సాధించారు ప్రభాస్. కేజీఎఫ్ సినిమాతో సంచలన విజయం సాధించిన ప్రశాంత్ నీల్ సలార్ సినిమాతో మరో హిట్ అందుకున్నారు. సలార్ సినిమా కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఈ సినిమాను రెండు పార్ట్ లుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక సలార్ సినిమా ఏకంగా 700కోట్ల వరకు వసూల్ చేసింది. ఇక ఇప్పుడు సలార్ పార్ట్ 2 తో పాటు కల్కి, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నారు ప్రభాస్. వరుస సినిమాలతో గ్యాప్ లేకుండా గడుపుతున్నారు డార్లింగ్. తాజాగా ప్రభాస్ తాను ఓ హీరోయిన్ యాక్టింగ్ అంటే ఇష్టం అని తెలిపారు.
అయితే ప్రభాస్ గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రభాస్ తనకు ఓ హీరోయిన్ యాక్టింగ్ అంటే ఇష్టం అని తెలిపారు. గతంలో ప్రభాస్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ప్రభాస్ కు సాయి పల్లవి నటన అంటే ఇష్టం అని తెలిపారు. ఈ ఇంటర్వ్యూలో యాంకర్ మీకు ఏ హీరోయిన్ నటన అంటే ఇష్టం అని అడగ్గా.. తనకు సాయి పల్లవి నటన అంటే ఇష్టం. కానీ మా ఇద్దరికీ హైట్ లో డిఫరెన్స్ ఉంది అని నవ్వుతు అన్నారు ప్రభాస్.
ప్రభాస్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రభాస్ చేసిన కామెంట్స్ పై ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. దేవత ఆమె మా దేవుడికి నచ్చింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు కొందరు. మరికొందరు ఒక్క మూవీ మీ ఇద్దరూ కలిసి చేయండి అన్న అని అంటున్నారు. మొత్తానికి ప్రభాస్ సాయి పల్లవి అంటే ఇష్టం అని చెప్పడంతో ఇద్దరి ఫ్యాన్స్ ఆనందంలో తేలిపోతున్నారు. సాయి పల్లవి ఇటీవలే సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చి ఇప్పుడు తిరిగి బిజీగా మారింది. ఆమె నాగ చైతన్యతో తండేల్ అనే సినిమాలో నటిస్తుంది .
సాయి పల్లవి పై ప్రభాస్ కామెంట్స్..
View this post on Instagram
ప్రభాస్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
సాయి పల్లవి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




