Kalki 2898 Ad: ఓటీటీలోకి ఆలస్యంగా కల్కి.. స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పటినుంచంటే..
నాగ్ అశ్విన్ డైరెక్షన్ అందరూ ప్రశంసిస్తున్నారు. దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ల పాత్రలు చూసి ఫుల్ మార్కులు వేస్తున్నారు సినీ లవర్స్. కేవలం నాలుగు రోజుల్లోనే కల్కి సినిమా 500 కోట్లు వసూల్ చేసి నాయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ తన నటనతో మరోసారి అదరకొట్టాడు. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా ఓటీటీ గురించిన వార్త ఫిలిం సర్కుల్స్ లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాను నెలరోజుల తర్వాత ఓటీటీలో చూడాలని అనుకున్న వారు కూడా ఉన్నారు.
ప్రస్తుతం ఇండియాలో ఉన్న అన్ని థియేటర్లలో ‘కల్కి 2898 AD’ సినిమా సందడి చేస్తోంది . బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న ఈ చిత్రాన్ని ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఆదరిస్తున్నారు. నాగ్ అశ్విన్ డైరెక్షన్ అందరూ ప్రశంసిస్తున్నారు. దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ల పాత్రలు చూసి ఫుల్ మార్కులు వేస్తున్నారు సినీ లవర్స్. కేవలం నాలుగు రోజుల్లోనే కల్కి సినిమా 500 కోట్లు వసూల్ చేసి నాయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ తన నటనతో మరోసారి అదరకొట్టాడు. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా ఓటీటీ గురించిన వార్త ఫిలిం సర్కుల్స్ లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాను నెలరోజుల తర్వాత ఓటీటీలో చూడాలని అనుకున్న వారు కూడా ఉన్నారు. అలాంటి వారికి ఓ చేదువార్త
గత రెండు-మూడేళ్లుగా OTT యూజర్స్ సంఖ్య పెరిగింది. చాలా మంది సినిమాలను థియేటర్లలో చూసే బదులు OTTలో చూడటానికి ఇష్టపడతారు. ఏ కొత్త సినిమా విడుదలైనా సరే.. ‘మరికొద్ది రోజుల్లో ఓటీటీలో వచ్చేస్తుంది చూద్దాం’ అనే వారు చాలా మంది ఉన్నారు. ‘కల్కి 2898 AD’ సినిమా కూడా త్వరలో OTTకి వస్తుందని చాలా మంది అనుకున్నారు. కానీ ఓటీటీ లవర్స్ కు ఓ బ్యాడ్ న్యూస్. ‘కల్కి 2898 AD’ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ వెర్షన్ OTT హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఇప్పటికే కొనుగోలు చేసింది. హిందీ వెర్షన్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇంతకుముందు పుకార్లు వచ్చాయి. అలాగే ఈ చిత్రం జూలై చివరి నాటికి OTTలో వీక్షించడానికి అందుబాటులో ఉంటుందని అంతా అనుకున్నారు. అయితే ఇప్పుడు నిర్మాతలు మనసు మార్చుకున్నారు.
‘కల్కి 2898 ఏడీ’ సినిమా బ్లాక్ బస్టర్ గా దూసుకుపోతుంది.. ప్రభాస్ రెబల్ ఫ్యాన్స్ ఈ సినిమాను ఒకటికి రెండు సార్లు చూస్తున్నారు. అంతలా ఆకట్టుకుంది ఈ సినిమా. ఈ సినిమాకు వీకెండ్‌లో భారీ కలెక్షన్లు వస్తున్నాయి. ఈ సినిమా మరికొన్ని రోజులు మంచి వసూళ్లు రాబట్టుకుంటుంది. దాంతో ఓటీటీలో సినిమా విడుదలను వాయిదా వేయాలని చిత్రబృందం నిర్ణయించుకుంది. ప్రస్తుత నిర్ణయం ప్రకారం సెప్టెంబర్ 2వ వారం తర్వాత మాత్రమే ‘కల్కి 2898 AD’ సినిమా OTTలో అందుబాటులో ఉంటుందని అంటున్నారు. భారీ బడ్జెట్‌తో ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు దాదాపు 600 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు అంచనా. లాభాలు రావాలంటే వెయ్యి కోట్లు వసూల్ చేయాలి. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో మంచి వసూళ్లను రాబడుతుండడంతో ఓటీటీలో విడుదల చేయాలనే ఆలోచనను మేకర్స్ మార్చుకున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.