Shalini Pandey: నటుడితో రొమాంటిక్ సీన్స్‌.. భయంతో పురుగులు పెట్టిన హీరోయిన్.

Shalini Pandey: నటుడితో రొమాంటిక్ సీన్స్‌.. భయంతో పురుగులు పెట్టిన హీరోయిన్.

Anil kumar poka

|

Updated on: Jul 01, 2024 | 12:11 PM

రౌడీ హీరో విజయ్ దేవరకొండ కెరీర్ మలుపు తిప్పిన సినిమా అర్జున్ రెడ్డి. ఈ మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది షాలిని పాండే. అందం, అమాయకత్వం, సొట్టబుగ్గలతో తెలుగు కుర్రకారును కట్టిపడేసింది. ఫస్ట్ మూవీతోనే సెన్సెషన్ హిట్ అందుకున్న షాలిని.. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో హీరోయిన్‏గా, మరికొన్ని సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ పోషించింది. మహానటి, ఇద్దరి లోకం ఒకటే వంటి చిత్రాల్లో మెరిసిన ఈ బ్యూటీ..

రౌడీ హీరో విజయ్ దేవరకొండ కెరీర్ మలుపు తిప్పిన సినిమా అర్జున్ రెడ్డి. ఈ మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది షాలిని పాండే. అందం, అమాయకత్వం, సొట్టబుగ్గలతో తెలుగు కుర్రకారును కట్టిపడేసింది. ఫస్ట్ మూవీతోనే సెన్సెషన్ హిట్ అందుకున్న షాలిని.. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో హీరోయిన్‏గా, మరికొన్ని సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ పోషించింది. మహానటి, ఇద్దరి లోకం ఒకటే వంటి చిత్రాల్లో మెరిసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ బాలీవుడ్ లో వరుస మూవీస్ చేస్తుంది. ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న షాలిని.. తాజాగా మహారాజ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. సిద్ధార్థ్ మల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో షాలినితోపాటు అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్, జైదీప్ అహ్లావత్ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమా జూన్ 21న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. తాజాగా బాలీవుడ్ హంగామాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది హీరోయిన్ షాలిని పాండే.

ఈ సినిమాలో కిషోరి పాత్రలో కనిపించింది షాలిని. ఇందులో జైదీప్ అహ్లావత్‏తో రొమాంటిక్ సీన్ గురించి మాట్లాడింది. అలాంటి సీన్ చేస్తున్నప్పుడు ఆకస్మాత్తుగా తాను బయటకు వెళ్లానని తెలిపింది. ఆ సీన్ తనపై ఎలాంటి ప్రభావం చూపిందో తెలియదని.. కానీ తనకు చీకటి గదిలో ఉండాలంటే భయమని చెప్పుకొచ్చింది. తనకు కాస్త సమయం కావాలని.. ప్రశాంతమైన వాతావరణం కావాలని దర్శకుడిని అడిగానని.. దీంతో వారు తన పరిస్థితిని అర్థం చేసుకున్నారని తెలిపింది. మొదట్లో స్క్రిప్ట్ చదివినప్పుడు కిషోరి పాత్ర చాలా తెలివి తక్కువ అమ్మాయి అనుకున్నానని.. ఆమె చేసే ప్రతి విషయాన్ని కచ్చితంగా నమ్ముతుందని చెప్పుకొచ్చింది. జైదీప్ అహ్లావత్ సేవ అనే ముసుగులో కొందరు నాయకులతో కలిసి ప్రజలను మోసం చేస్తుంటారు. ఇందులో అతడు స్త్రీలపై అత్యాచారం చేసే పాత్రలో కనిపిస్తాడు. 1800 కాలంలో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రాన్ని వైఆర్ఎఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించగా.. జునైద్ కోర్టులో మహారాజ్ దోపిడీలపై పోరాడే రచయితగా నటించాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.