Kalki 2898 AD: ప్రభాస్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. ‘కల్కి’ మూవీ అడ్వాన్స్ టికెట్ బుకింగ్ ఎప్పటినుంచంటే?
సలార్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ నటించిన సినిమా కావడంతో కల్కిపై అంచనాలు భారీగా ఉన్నాయి. భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రభాస్ నటిస్తున్న ఈ చిత్రానికి కౌంట్ డౌన్ మొదలైంది . ఈ సినిమా అడ్వాన్స్ టికెట్ బుకింగ్ కి డేట్ ఫిక్స్ అయింది. ఈ మేరకు టీమ్ సమాచారం ఇచ్చింది.

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘కల్కి 2898 AD’. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సినిమా విడుదలకు మరికొద్ది రోజులు మాత్రమే సమయం ఉంది. సలార్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ నటించిన సినిమా కావడంతో కల్కిపై అంచనాలు భారీగా ఉన్నాయి. భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రభాస్ నటిస్తున్న ఈ చిత్రానికి కౌంట్ డౌన్ మొదలైంది . ఈ సినిమా అడ్వాన్స్ టికెట్ బుకింగ్ కి డేట్ ఫిక్స్ అయింది. ఈ మేరకు టీమ్ సమాచారం ఇచ్చింది. జూన్ 7 నుంచి ‘కల్కి 2898 AD’ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం కానుంది. ఈ విషయంపై టీమ్ సమాచారం ఇచ్చింది. ఇది విని అభిమానులు థ్రిల్ అవుతున్నారు. ఇప్పటికే విదేశాల్లో ఈ సినిమాకి సంబంధించిన టికెట్ బుకింగ్ మొదలైంది. తాజాగా కల్కి సినిమా రన్ టైమ్ గురించి ఒక ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది.
‘కల్కి 2898 AD’ సినిమా నిడివి రెండు గంటల యాభై నిమిషాలు. సాధారణంగా ఇటీవల విడుదలైన సినిమాలు రెండు నుంచి రెండున్నర గంటల్లో పూర్తవుతాయి. ఇప్పుడు ‘కల్కి 2898 AD’ సినిమా నిడివి దాదాపు మూడు గంటలు కావటం వల్ల ప్రేక్షకులకు కాస్త ఎక్కువే అనిపించవచ్చు. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఎంజాయ్ చేస్తారని చిత్ర బృందం చెబుతోంది. ‘కల్కి 2898 AD’ ప్రభాస్ సరసన దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తోంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఓటీటీలో సందడి చేస్తోన్న బుజ్జి అండ్ భైరవ..
Enter the world of #Kalki2898AD with #BujjiAndBhairava, streaming now on @PrimeVideoIN.https://t.co/UhVVHeXhMx#Prabhas @SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @BelikeBujji @saregamaglobal @saregamasouth… pic.twitter.com/NlnlzapKJp
— Kalki 2898 AD (@Kalki2898AD) June 2, 2024
బుజ్జి కారును నడిపిన ఫార్ములా వన్ డ్రైవర్ నారాయణ్ కార్తికేయన్.. వీడియో ఇదిగో..
India’s First Formula 1 Driver @narainracing joins the race with #Bujji.#Kalki2898AD #Prabhas @SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @BelikeBujji @saregamaglobal @saregamasouth #Kalki2898ADonJune27 pic.twitter.com/xUEONBiSIK
— Kalki 2898 AD (@Kalki2898AD) May 26, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.