Prabhas: మరీ ఇంత మంచోడివేంటయ్యా డార్లింగ్.. ఆ యంగ్ హీరో సినిమాకు తన కాస్ట్లీ కారు ఇచ్చిన ప్రభాస్..

తాజాగా ఓ యంగ్ హీరో సినిమా షూటింగ్ కోసం తన కాస్ట్లీ కారును పంపించాడట. అతడు మరెవరో కాదు.. హీరో కార్తికేయ. ఇటీవల భజే వాయువేగం సినిమా ప్రమోషన్లలో ఈ విషయాన్ని బయటపెట్టాడు. ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోగా పరిచయమైన కార్తికేయ.. ఇప్పుడు హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తున్నాడు.

Prabhas: మరీ ఇంత మంచోడివేంటయ్యా డార్లింగ్.. ఆ యంగ్ హీరో సినిమాకు తన కాస్ట్లీ కారు ఇచ్చిన ప్రభాస్..
Prabhas
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 01, 2024 | 10:55 AM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మంచి మనసు గురించి చెప్పక్కర్లేదు. అభిమానులకు సాయం చేయడంలో ముందుంటారు. అలాగే షూటింగ్ సెట్‏లో ప్రతి ఒక్కరికి స్వయంగా ఇంటి నుంచి భోజనం తీసుకువస్తాడు. అలాగే తన తోటి నటీనటులకు ఇంట్లో చేసిన భోజనాన్ని అందిస్తాడు. ఈ విషయాన్ని ఇప్పటికే చాలా మంది తారలు సోషల్ మీడియాలో చెబుతూ ప్రభాస్ వ్యక్తిత్వంపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ యంగ్ హీరో సినిమా షూటింగ్ కోసం తన కాస్ట్లీ కారును పంపించాడట. అతడు మరెవరో కాదు.. హీరో కార్తికేయ. ఇటీవల భజే వాయువేగం సినిమా ప్రమోషన్లలో ఈ విషయాన్ని బయటపెట్టాడు. ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోగా పరిచయమైన కార్తికేయ.. ఇప్పుడు హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తున్నాడు. చాలా కాలం గ్యాప్ తర్వాత భజే వాయువేగం సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చాడు. మే 31న విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి.

ఇదిలా ఉంటే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కార్తికేయ మాట్లాడుతూ.. “ఈ సినిమాకు చాలా మంది హీరోలు సపోర్ట్ చేశారు. మహేష్ బాబు మా మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. చిరంజీవిగారు టీజర్ రిలీజ్ చేశారు. ప్రభాస్ అన్న తన జాగ్వార్ ఎక్స్ కారును మా సినిమా షూటింగ్ కోసం పంపించారు” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఓ సినిమా షూటింగ్ కోసం తన కాస్ట్లీ కారును పంపించడం తెలిసి ప్రభాస్ మంచి మనసుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ హీరో అయినా.. డార్లింగ్ సింప్లిసిటీకి ఫిదా అవుతున్నారు.

కార్తికేయ నటించిన భజేవాయువేగం సినిమాలో యాక్షన్ సీన్స్ లో డ్రైవ్ చేయడానికి ప్రభార్ జాగ్వార్ కారు వాడినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని యూవీ నిర్మాణ సంస్థ తెరకెక్కించింది. ఇక ప్రభాస్ కాస్ట్లీ జాగ్వార్ కారు దాదాపు రూ.75 లక్షలు ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ కల్కి 2898 ఏడీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. జూన్ 27న ఈ మూవీ రిలీజ్ కాబోతుండడంతో ఇటీవలే ప్రమోషన్స్ స్టా్ర్ట్ చేసింది చిత్రయూనిట్.

Karthikeya

Karthikeya

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.