Tollywood: బ్యూటీ టాలెంట్‏కు ఫిదా అయిన టాలీవుడ్.. సమంతకు ట్విన్ సిస్టర్‏లా ఉంటుంది ఈ వయ్యారి.. ఎవరో తెలుసా..?

తాజాగా టాలీవుడ్ యంగ్ హీరోయిన్ చైల్డ్ హుడ్ ఫోటో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. పైన ఫోటోను చూశారు కదా.. తన అన్నయ్య చేతులలో కనిపిస్తున్న ఆ బూరె బుగ్గల బుజ్జాయి ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. తొలి సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ నటనపరంగా మంచి మార్కులు కొట్టేసింది ఈ బ్యూటీ. కానీ ఇప్పుడు తన కొత్త సినిమాతో సూపర్ సక్సెస్ అందుకుని ఫుల్ జోష్ మీదుంది. ఇంతకీ ఎవరో గుర్తుపట్టారా.. ?

Tollywood: బ్యూటీ టాలెంట్‏కు ఫిదా అయిన టాలీవుడ్.. సమంతకు ట్విన్ సిస్టర్‏లా ఉంటుంది ఈ వయ్యారి.. ఎవరో తెలుసా..?
Actress..
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 01, 2024 | 10:21 AM

సోషల్ మీడియాలో నిత్యం సెలబ్రెటీలకు సంబంధించిన ఏదొక విషయం వైరలవుతుంటుంది. సినిమా అప్డేట్స్ దగ్గర్నుంచి పర్సనల్ విషయాలు.. చైల్డ్ హుడ్ ఫోటోస్ ఇలా అనేక విషయాలు నెట్టింట చక్కర్లు కొడుతుంటాయి. ముఖ్యంగా తమ అభిమాన తారల చిన్ననాటి ఫోటోస్ తెగ షేర్ చేస్తుంటారు ఫ్యాన్స్. అప్పట్లో తమ ఫేవరేట్ హీరోయిన్స్ ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా టాలీవుడ్ యంగ్ హీరోయిన్ చైల్డ్ హుడ్ ఫోటో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. పైన ఫోటోను చూశారు కదా.. తన అన్నయ్య చేతులలో కనిపిస్తున్న ఆ బూరె బుగ్గల బుజ్జాయి ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. తొలి సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ నటనపరంగా మంచి మార్కులు కొట్టేసింది ఈ బ్యూటీ. కానీ ఇప్పుడు తన కొత్త సినిమాతో సూపర్ సక్సెస్ అందుకుని ఫుల్ జోష్ మీదుంది. ఇంతకీ ఎవరో గుర్తుపట్టారా.. ? తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ సమంతకు ట్విన్ సిస్టర్ లా ఉంటుందని అంటారు అభిమానులు. తనే హీరోయిన్ ఐశ్వర్య మీనన్.

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన స్పై సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఐశ్వర్య మీనన్. ఈ చిత్రంలో గ్లామర్ పరంగానే కాకుండా యాక్షన్ తోనూ మెప్పించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. కానీ ఐశ్వర్య నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమా తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకున్న ఐశ్వర్య ఇప్పుడు భజే వాయువేగం సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చింది. హీరో కార్తికేయ నటించిన ఈ సినిమా మే 31న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. మొదటి షో నుంచే పాజిటివ్ రివ్యూస్ అందుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయ్యింది. దీంతో ఇటు ఐశ్వర్యకు కూడా మంచి క్రేజ్ వచ్చింది.

ప్రస్తుతం భజే వాయువేగం సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తుంది ఐశ్వర్య. ఇక ఇటీవల ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న ఐశ్వర్య.. స్పై మూవీ ఫెయిల్యూర్ పై రియాక్ట్ అయ్యింది. ప్రతి సినిమాను తాను ఇష్టపడే చేస్తానని.. కానీ ఫలితం అనేది తన చేతుల్లో ఉండదని తెలిపింది. తాను చేసే సినిమాలన్నీ సూపర్ హిట్ కావాలని కోరుకుంటానని.. కానీ ప్రేక్షకులకు నచ్చితేనే విజయం దక్కుతుందంటూ చెప్పుకొచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.