Allu Arjun: రూ.10 కోట్ల ఆఫర్ రిజెక్ట్ చేసిన అల్లు అర్జున్.. అసలు విషయం తెలిస్తే హాట్యాఫ్ అనాల్సిందే..
అయితే పుష్ప మూవీ తర్వాత బన్నీతో తమ ఉత్పత్తులను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసేందుకు ఎన్నో కంపెనీలు పోటీపడ్డాయి. ఆ సమయంలో కొన్ని యాడ్స్ కూడా చేశారు బన్నీ. కానీ ఓ అంతర్జాతీయ సంస్థకు ఆఫర్ మాత్రం సున్నితంగా రిజెక్ట్ చేశారట. సదరు సంస్థ నిమిషం యాడ్ కోసం రూ.10 కోట్లు ఆఫర్ చేసినా అసలు చేయనని చెప్పేశారట.
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌కు వరల్డ్ వైడ్ ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. పుష్ప సినిమాతో బన్నీ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. అంతేకాదు పుష్పరాజ్ పాత్రలో అద్భుతమైన నటనకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్ అందుకుని సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ మూవీతో అటు భారీగా రెమ్యునరేషన్ పెంచేశాడు బన్నీ. ఇప్పటివరకు సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక ఫాలోయింగ్ సంపాదించుకున్న బన్నీకి.. ఇప్పుడు నార్త్ లో విపరీతమైన ఫ్యాన్ బేస్ పెరిగింది. అయితే పుష్ప మూవీ తర్వాత బన్నీతో తమ ఉత్పత్తులను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసేందుకు ఎన్నో కంపెనీలు పోటీపడ్డాయి. ఆ సమయంలో కొన్ని యాడ్స్ కూడా చేశారు బన్నీ. కానీ ఓ అంతర్జాతీయ సంస్థకు ఆఫర్ మాత్రం సున్నితంగా రిజెక్ట్ చేశారట. సదరు సంస్థ నిమిషం యాడ్ కోసం రూ.10 కోట్లు ఆఫర్ చేసినా అసలు చేయనని చెప్పేశారట. ఇంతకీ బన్నీ ఆ డెసిషన్ ఎందుకు తీసుకున్నారో తెలుసుకుందామా.
పుష్ప: ది రూల్ విడుదలైన తర్వాత అల్లు అర్జున్‌కి తెలిసిన పొగాకు బ్రాండ్ టెలివిజన్ వాణిజ్య ప్రకటనను ఆఫర్ చేసిందట. అందుకు సుమారు రూ.10 కోట్లు ఆఫర్ చేశారట. కేవలం 60 సెకండ్లు మాత్రమే తమ యాడ్ లో కనిపించాలని రిక్వెస్ట్ చేశారట. కానీ ఆ ఆఫర్ ను బన్నీ సున్నితంగా రిజెక్ట్ చేశారని సమాచారం. మద్యం, పొగాకు వంటి ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ ప్రకటనలలో నటిస్తే తన అభిమానులను, శ్రేయోభిలాషులకు చెడును వ్యాప్తి చేసినట్లు అవుతుందని అన్నారట. అందుకు తనకు ఎంతో రెమ్యునరేషన్ ఇచ్చినా చేయనని అన్నారట. మే31న ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవ సందర్భంగా బన్నీ తీసుకున్న ఈ సూపర్ డెసిషన్ న్యూస్ మరోసారి నెట్టింట వైరలవుతుంది. అప్పట్లో బన్నీ తీసుకున్న నిర్ణయంపై ప్రశంసుల కురిపిస్తున్నారు ఫ్యాన్స్.
ఇదిలా ఉంటే ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కాగా..ఈసారి సెకండ్ పార్టులో సుకుమార్ ఎలాంటి మ్యాజిక్ చేయనున్నాడో తెలుసుకునేందుకు ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సినిమా ఆగస్ట్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.