సినిమా షూటింగ్‌లకు రష్మిక బ్రేక్ .. కారణమిదే
10 January 2025
Basha Shek
అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో మరోసారి పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయిపోయింది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా
పుష్ప 2 తర్వాత కూడా రష్మిక చేతిలో పలు కీలక ప్రాజెక్టులున్నాయి. అందులో సల్మాన్ ఖాన్ తో నటిస్తోన్న సికందర్ ఒకటి.
అలాగే ధనుష్ కుబేర తో పాటు రెండు లేడీ ఓరియంటెడ్ సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంటోందీ అందాల తార.
ఇదిలా ఉంటే రష్మిక మందన్నా జిమ్ చేస్తూ గాయపడింది. ఈ విషయాన్ని ఆమె సన్నిహితులు కూడా ధ్రువీకరించారు.
'జిమ్ చేస్తూ ఈ మధ్యే రష్మిక గాయపడింది. ప్రస్తుతం ఆమె విశ్రాంతి తీసుకుంటూ త్వరగా కోలుకునేందుకు ట్రై చేస్తోది'
గాయం కారణంగా రష్మిక సినిమాల షూటింగులు ఆగిపోయాయి. త్వరలోనే మళ్లీ షూటింగు మొదలు పెడుతుంది' అని తెలిపాయి.
కాగా రష్మిక గాయం చిన్నదే అయినా.. ఆమె చేతుల్లో ప్రస్తుతం పలు పాన్ ఇండియా ప్రాజెక్టులు ఉన్నాయి.
ఈ కారణంగానే రష్మిక కాస్త విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. త్వరలోనే ఆమె సికందర్ షూట్ లో జాయిన్ కానుందని సమాచారం.
ఇక్కడ క్లిక్ చేయండి..