50ఏళ్ల వయసులోనూ ఏం ఉన్నాడు! ఇలాంటి బాడీ మీకూ కావాలా?
10 January 2025
TV9 Telugu
TV9 Telugu
చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ రంగంలోకి అడుగుపెట్టి.. అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వారిలో కండల వీరుడు హృతిక్ రోషన్ ఒకరు. ప్రస్తుతం హృతిక్ 50వ పడిలో ఉన్నాడు. అయినా ఫిట్ నెస్ విషయంలో ఎక్కడారాజీలేకుండా ఇప్పటికీ అదే బాడీ మెయింటైన్ చేస్తున్నాడు
TV9 Telugu
అందుకే హృతిక్‌కు 'గ్రీకు వీరుడు' అనే పేరుతో కూడా ఉంది. హృతిక్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. వర్కౌట్ చేస్తున్న ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు
TV9 Telugu
హృతిక్ రోషన్ లాంటి బాడీని నిర్మించుకోవడానికి ఏ వ్యక్తి అయినా కఠినమైన వ్యాయామం, డైట్ ప్లాన్‌ని అనుసరించాల్సిందే. సరిగ్గా తినడం, వ్యాయామం చేయడంతో పాటు, తగినంత నిద్ర పోవడం కూడా చాలా అవసరం. హృతిక్ వర్కౌట్ ప్లాన్ ఎలా ఉంటుందంటే..
TV9 Telugu
హృతిక్ తాజా మువీ 'ఫైటర్' కోసం ప్రత్యేకంగా వర్కౌట్ చేస్తున్నారు. ఇది కార్డియో, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వ్యాయామాల మిశ్రమం. ఫిట్‌గా ఉండటానికి హృతిక్ రోషన్ కార్డియో రొటీన్ కూడా ఫాలో అవుతాడు
TV9 Telugu
హృతిక్ స్టేషనరీ సైక్లింగ్ వంటి కార్డియోవాస్కులర్ వ్యాయామాలు తన దినచర్యలో ఖచ్చితంగా భాగం చేసుకుంటాడు. హృతిక్ ప్రతిరోజూ కార్డియో కోసం 40 నిమిషాల సమయం తీసుకుంటాడు
TV9 Telugu
మణికట్టు, చేతి కండరాల కోసం లక్ష్య వ్యాయామాలతో పాటు దిగువ శరీర కసరత్తులు కూడా చేస్తుంటాడు. ప్లాంక్ షోల్డర్ ట్యాప్ అనేది హృతిక్ దినచర్యలో ఒక ముఖ్యమైన భాగం
TV9 Telugu
కఠినమైన వ్యాయామంతో పాటు హృతిక్ రోషన్ దినచర్యలో ముఖ్యమైన భాగం ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం తీసుకోవడం. హృతిక్ డైట్ ప్లాన్ అతని వర్కౌట్ రొటీన్ ప్రకారం ఉంటుంది
TV9 Telugu
కఠినమైన శిక్షణ, సమతుల్య ఆహారం, తగినంత నిద్ర తన రోజువారీ దినచర్యలో ముఖ్యమైన భాగాలు. మీకూ హృతిక్‌లాంటి శరీరాకృతి కావాలంటే ఈ అలవాట్లను అలవర్చుకోవడం చాలా ముఖ్యం