Varsham Movie: ఇది ప్రభాస్ క్రేజ్ అంటే.. రీరిలీజ్‌కు ముందే సంచలనం సృష్టిస్తోన్న వర్షం మూవీ..
తెలుగు రాష్ట్రాల్లో మరోసారి రీరిలీజ్ ట్రెండ్ దూసుకుపోతుంది. ఒకప్పుడు సూపర్ హిట్స్ అయిన సినిమాలు మరోసారి అడియన్స్ ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి నటించిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా రీరిలీజ్ అయి భారీ వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ మలుపు తిప్పిన సినిమా వర్షం. దివంగత డైరెక్టర్ శోభన్ తెరకెక్కించిన ఈ సినిమా థియేటర్లలో భారీ విజయాన్ని అందుకుంది. 2004లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. అప్పట్లో ఈ మూవీ ఓ రేంజ్ వసూళ్లు రాబట్టింది. ఇందులో ప్రభాస్ సరసన త్రిష కథానాయికగా నటించింది. అప్పట్లో ఈ మూవీలోని సాంగ్స్ సైతం సూపర్ హిట్ అయ్యాయి. థియేటర్లలో భారీ విజయాన్ని అందుకుని కలెక్షన్ సునామీ సృష్టించిన ఈ సినిమాతో ప్రభాస్ క్రేజ్ మారిపోయింది. అప్పటివరకు ప్లాపులతో నెట్టుకోస్తున్న డార్లింగ్ కెరీర్ మలుపు తిప్పింది ఈ సినిమా. ఈ చిత్రాన్ని ఇప్పుడు మరోసారి అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు మేకర్స్. ఈనెల 23న ఈ చిత్రాన్ని 4కే వెర్షన్ తో వెండితెరపైకి తీసుకురానున్నారు.
దాదాపు 21 ఏళ్ల తర్వాత మరోసారి ఈ మూవీ థియేటర్లలో అడుగుపెట్టనుంది. అయితే మే 23న రీరిలీజ్ కానున్న ఈ మూవీ విడుదలకు ముందే మరోసారి సంచలనం సృష్టించింది. ఇప్పటివరకు ఈ సినిమా 6వేల టికెట్స్ అమ్ముడైనట్లు సమాచారం. ఈ సినిమాను 15 షోలు మాత్రమే వేయనున్నట్లు టాక్. ఇప్పటికే ఈ చిత్రాన్ని రెండుసార్లు రీరిలీజ్ చేశారు మేకర్స్.
లవ్ స్టోరీ, కామెడీ, యాక్షన్ అన్ని అంశాలతో ఫుల్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా అప్పట్లో రూ.32కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ చిత్రాన్ని కేవలం రూ.8 కోట్లతో నిర్మించినట్లు టాక్. ఇక ఇప్పుడు మే 23న ఈ సినిమా మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది.
Nearly 6,000 tickets sold for the #Varsham4K re-release with fewer than 15 shows opened, 8 DAYS before release🔥
An excellent start for a 3rd party release without any occasion—especially for a film that has already been re-released twice. Go Grab your tickets now! #Prabhas pic.twitter.com/FwXKxdEmB5
— Prabhas FC (@PrabhasRaju) May 15, 2025
ఇవి కూడా చదవండి :
Tollywood: వామ్మో.. తిని తిని 108 కిలోలు పెరిగిపోయిందట.. ఈ యాంకరమ్మను గుర్తుపట్టారా.. ?
Tollywood: చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ.. 16 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. హార్మోన్ ఇంజక్షన్స్ తీసుకుందంటూ..
Mahesh Babu: మహేష్ బాబు రిజెక్ట్ చేశాడు.. బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన ఉదయ్ కిరణ్.. ఏ సినిమా అంటే..
Tollywood: 36 ఏళ్ల హీరోయిన్‌తో 60 ఏళ్ల హీరో లిప్ లాక్ సీన్.. దెబ్బకు కొడుకుతో ఆగిపోయిన పెళ్లి..




