AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anushka Shetty : ఎన్నాళ్లకెన్నాళ్లకు.. కెమెరా ముందుకు వచ్చిన అనుష్క.. ప్రభాస్, రానాతో కలిసి ముచ్చట్లు.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ..

టాలీవుడ్ మూవీ లవర్స్ హృదయాలను దొచుకున్న హీరోయిన్ అనుష్క శెట్టి. అరుంధతి, భాగమతి, బాహుబలి వంటి సూపర్ హిట్ చిత్రాలతో ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది స్వీటీ. కానీ కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగిత తెలిసిందే. చివరగా ఘాటి చిత్రంతో అడియన్స్ ముందుకు వచ్చిన ఈ అమ్మడు.. ఆ తర్వాత సోషల్ మీడియాకు బ్రేక్ ప్రకటించింది. అలాగే మీడియాకు సైతం దూరంగా ఉంటుంది. తాజాగా చాలా కాలం తర్వాత కెమెరా ముందుకు వచ్చింది అనుష్క.

Anushka Shetty : ఎన్నాళ్లకెన్నాళ్లకు.. కెమెరా ముందుకు వచ్చిన అనుష్క.. ప్రభాస్, రానాతో కలిసి ముచ్చట్లు.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ..
Baahubali 3
Rajitha Chanti
|

Updated on: Jun 26, 2026 | 9:54 AM

Share

తెలుగు చలన చిత్ర పరిశ్రమ స్థాయిని మార్చిన సినిమా అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు బాహుబలి. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాహుబలి 1, 2 పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ క్రియేట్ చేశాయి. ఇందులో ప్రభాస్, అనుష్క, రానా ప్రధాన పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. అలాగే రమ్యకృష్ణ, నాజర్, తమన్నా, రోహిణి, సత్యరాజ్ ముఖ్య పాత్రలు పోషించారు. రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో టాలీవుడ్ సత్తా చాటింది. ఇదివరకే ఈ మూవీ ఓటీటీలో అందుబాటులో ఉండగా.. తాజాగా ‘బాహుబలి. ది టార్చ్ బేరర్ ‘ నెట్ ఫ్లిక్స్ వేదికగా ఓటీటీ మూవీ లవర్స్ ముందుకు వచ్చింది. ఈ సినిమా స్ట్రీమింగ్ కు ముందు నెట్ ఫ్లిక్స్ ఓ వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. అందులో సినీ ప్రియులకు సర్ ప్రైజ్ ఇస్తూ బాహుబలి 3 ఉంటుందని అధికారికంగా చెప్పింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ వైరలవుతుంది.

ఎక్కువమంది చదివినవి : Cinema : నిజమైన సంఘటనల ఆధారంగా సిరీస్.. ఓటీటీలో ట్రెండింగ్‏లో ఉన్న వెబ్ సిరీస్..

అయితే ఆ వీడియోలో ప్ఱభాస్, రానా, అనుష్క ముచ్చట్లు పెడుతూ.. సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. ముఖ్యంగా ఈ వీడియోలో అనుష్క స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. చాలా కాలంగా మీడియాకు దూరంగా ఉంటున్న స్వీటీ.. ఫస్ట్ టైమ్ కెమెరా ముందుకు వచ్చింది. అలాగే చాలా సంవత్సరాల తర్వాత ప్రభాస్, రానా, అనుష్క కలిసి సరదాగా మాట్లాడుకోవడం చూసి తెగ మురిసిపోతున్నారు ఫ్యాన్స్. ఈ వీడియోలో ప్రభాస్, రానా, అనుష్క మాట్లాడుతూ.. ‘ప్రపంచం ఈ ప్రకటనను ఊహించలేదు. మీ అందరికోసం బాహుబలి మూడో భాగం రానుంది’ అంటూ చెప్పుకొచ్చారు. అలాగే ఇందులో ప్రభాస్ మాట్లాడుతూ.. ‘స్వీటీ నవ్వడం స్టార్ట్ చేస్తే దాదాపు 40 నిమిషాలు ఆపకుండా నవ్వుతుంది. ఆమె రోజూ సెట్స్ కు వచ్చేటప్పుడు ఈరోజు నవ్వుకూడదు అనుకుంటూ వచ్చేది.. నవ్వితే షూట్ మొత్తం ఆగిపోతుందని ఇంత పెద్ద సెట్ వేసిన నిర్మాతకు నష్టం కలుగుతుందని అనుకనేది’ అంటూ సరదాగా చెప్పుకొచ్చాడు ప్రభాస్.

ఎక్కువమంది చదివినవి : Cinema : ఇదెక్కడి డిమాండ్ రా బాబూ.. ప్రేమ, ద్రోహం, ప్రతీకారం.. ఓటీటీలో దూసుకుపోతున్న వెబ్ సిరీస్..

ఈ సినిమాకు తనకు ఎప్పటికీ ఒక ఎమోషనల్ జర్నీ అని అన్నారు. ఇక సత్యరాజ్ మాట్లాడుతూ.. సెట్ లో కాస్ట్యూమ్స్ చాలా ఉండేవని.. కనుచూపు మేరలో మొత్తం డ్రెస్ లు ఉండేవని.. అది చూసి ఆశ్చర్యపోయినట్లు చెప్పారు. ఇక ఇప్పుడు బాహుబలి సినిమా గురించి అధికారిక ప్రకటన రావడంతో మూవీ లవర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఎక్కువమంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరో.. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్.. కానీ తెలుగులో అట్టర్ ప్లాప్.. కారణం ఇదే..

ప్రభాస్, అనుష్క, రానా వీడియో.. 

ఎక్కువమంది చదివినవి : Rajanna Movie : రాజన్న సినిమాకు నాకు ఇచ్చిన రెమ్యునరేషన్ అంతే.. టాలీవుడ్ నటుడు..

Follow Us
మొహరం స్పెషల్.. దమ్ కే రోట్.. నెయ్యితో చేసే ఈ స్వీట్‎కి లక్షలాది
మొహరం స్పెషల్.. దమ్ కే రోట్.. నెయ్యితో చేసే ఈ స్వీట్‎కి లక్షలాది
చిరుతో త్రిష ముచ్చట.. అన్నయ్యతో వెంకీ ఫన్నీ వీడియో..
చిరుతో త్రిష ముచ్చట.. అన్నయ్యతో వెంకీ ఫన్నీ వీడియో..
ప్రముఖ హీరోయిన్‌ ఇంట్లో వ్యాపారవేత్త మృతదేహం.. ఏం జరిగిందో?
ప్రముఖ హీరోయిన్‌ ఇంట్లో వ్యాపారవేత్త మృతదేహం.. ఏం జరిగిందో?
ఈ దొంగలు ఏమేం ఎత్తుకెళ్లారో తెలిస్తే అవాక్కవుతారు..
ఈ దొంగలు ఏమేం ఎత్తుకెళ్లారో తెలిస్తే అవాక్కవుతారు..
బంగారం ధరల్లో బిగ్ ఛేంజ్.. ఒక్కరోజులోనే సీన్ రివర్స్..
బంగారం ధరల్లో బిగ్ ఛేంజ్.. ఒక్కరోజులోనే సీన్ రివర్స్..
మరో విజయ్‌ దేవరకొండ దొరికేశాడు.. ఆ యంగ్ హీరోపై ఆర్జీవీ ప్రశంసలు
మరో విజయ్‌ దేవరకొండ దొరికేశాడు.. ఆ యంగ్ హీరోపై ఆర్జీవీ ప్రశంసలు
మహిళల టీ20 వరల్డ్ కప్‌లో భారత్ ఘోర ఫీల్డింగ్
మహిళల టీ20 వరల్డ్ కప్‌లో భారత్ ఘోర ఫీల్డింగ్
ప్రభాస్, రానాతో అనుష్క ముచ్చట్లు.. వీడియో చూసి మురిసిపోతున్న ఫ్యా
ప్రభాస్, రానాతో అనుష్క ముచ్చట్లు.. వీడియో చూసి మురిసిపోతున్న ఫ్యా
చుక్కనూనె లేకుండా నోటికి భలే రుచిగా వుండే చిక్కుడుకాయ పచ్చడి
చుక్కనూనె లేకుండా నోటికి భలే రుచిగా వుండే చిక్కుడుకాయ పచ్చడి
ఈ మూడు వజ్రాల్లో అసలైనది ఏది?.. మీ తెలివితేటలకు బస్తీమే సవాల్
ఈ మూడు వజ్రాల్లో అసలైనది ఏది?.. మీ తెలివితేటలకు బస్తీమే సవాల్