
ఆదిపురుష్ సినిమాలో రాముడిగా అభిమానులను అలరించారు ప్యాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్. అయితే ఫ్యాన్స్ ఊహించుకున్న రేంజ్‌లో ఈ సినిమా విజయం సాధించలేకపోయింది. ఇప్పుడు ప్రభాస్ అభిమానుల ఆశలన్నీ రాబోయే మూవీ సలార్‌పైనే ఉన్నాయి. ఈ సినిమాలో మళ్లీ తన పాత యాక్షన్ మోడ్‌లోకి వెళ్లిపోయారు ప్రభాస్. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న సలార్‌ను ఈ ఏడాది సెప్టెంబర్28న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేసేందకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగా ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈక్రమంలో సలార్ టీజర్ రిలీజ్‌పై నిన్న ఒక పోస్ట్ పెట్టింది హోంబలే ఫిల్మ్స్. తాజాగా టీజర్ రిలీజ్ డేట్ అండ్ టైమ్‌ను ఫిక్స్ చేస్తూ మరో పోస్ట్ చేశారు. ఇందులో జులై 6, 2023 న ఉదయం 5:12 గంటలకు సలార్ టీజర్‌ను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. దీంతో పాటు మూవీలో ప్రభాస్ పవర్ ఫుల్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఇది అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.
సలార్ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నాడు. అలాగే జగపతిబాబు, శ్రియారెడ్డి, ఈశ్వరి రావు, మధు గురుస్వామి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రవి బస్రూర్ స్వరాలు సమకూరుస్తున్నారు. కాగా సలార్ సినిమాను హాలీవుడ్ లెవెల్లో వరల్డ్ వైడ్‌గా రి లీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అందుకే సలార్ సినిమాలోని కీలకమైన యాక్షన్ సన్నివేశాలను హాలీవుడ్ స్టంట్ మాస్టర్లతో చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తుంది.
𝐁𝐫𝐚𝐜𝐞 𝐲𝐨𝐮𝐫𝐬𝐞𝐥𝐟 𝐟𝐨𝐫 𝐭𝐡𝐞 𝐦𝐨𝐬𝐭 𝐯𝐢𝐨𝐥𝐞𝐧𝐭 𝐦𝐚𝐧, #𝐒𝐀𝐋𝐀𝐀𝐑 🔥
Watch #SalaarTeaser on July 6th at 5:12 AM on https://t.co/Sg2BuxBKNA #SalaarTeaserOnJuly6th#Prabhas #PrashanthNeel @PrithviOfficial @hombalefilms #VijayKiragandur @IamJagguBhai… pic.twitter.com/pMGQZ49eQh
— Salaar (@SalaarTheSaga) July 3, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..