AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: ప్రభాస్ అభిమానులకు క్రేజీ గుడ్ న్యూస్.. హను రాఘవపూడితో డార్లింగ్ మూవీ షూటింగ్ అప్పుడే స్టార్ట్..

సీతారామం సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ హారర్ లవ్ స్టోరీ చేయనున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా వీరిద్దరి కాంబోలో రాబోయే ప్రాజెక్ట్ గురించి అనేక రకాల వార్తలు ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా వీరిద్దరి కలయికలో రాబోయే సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది

Prabhas: ప్రభాస్ అభిమానులకు క్రేజీ గుడ్ న్యూస్.. హను రాఘవపూడితో డార్లింగ్ మూవీ షూటింగ్ అప్పుడే స్టార్ట్..
Prabhas
Rajitha Chanti
|

Updated on: Aug 10, 2024 | 5:31 PM

Share

ఇటీవలే కల్కి 2898 AD సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. రూ. 600 కోట్లతో నిర్మించిన ఈ సినిమా ఏకంగా రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీంతో ప్రభాస్ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై మరిన్ని అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో రాజాసాబ్ చిత్రంలో నటిస్తున్నాడు ప్రభాస్. ఈ మూవీ తర్వాత సలార్ 2 మూవీతోపాటు.. అటు స్పిరిట్ చిత్రాన్ని కూడా స్టార్ట్ చేయనున్నారు. ఇవే కాకుండా సీతారామం సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ హారర్ లవ్ స్టోరీ చేయనున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా వీరిద్దరి కాంబోలో రాబోయే ప్రాజెక్ట్ గురించి అనేక రకాల వార్తలు ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా వీరిద్దరి కలయికలో రాబోయే సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. లేటేస్ట్ అప్డేట్ ప్రకారం హను రాఘవపూడి డైరెక్షన్లో నటించేందుకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

త్వరలోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలు కానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ఫౌజీ అనే పేరును పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆగస్ట్ 17న హైదరాబాద్ లో ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు చేయనున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఆగస్ట్ 18 నుంచి స్టార్ట్ కానున్నట్లు సమాచారం. దాదాపు మూడు వారాల పాటు మధురైలో చిత్రీకరణ జరగనుంది. ఇందులో కేవలం 10 రోజులు మాత్రమే ప్రభాస్ షూటింగ్ లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఆగస్ట్ 22 నుంచి చిత్రీకరణలో జాయిన్ కానున్నాడు ప్రభాస్.

ప్రస్తుతం కల్కి సక్సెస్ జోష్ లో ఉన్న ప్రభాస్.. మరోవైపు రాజాసాబ్ మూవీ కంప్లీట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, ఆకట్టుకున్నాయి. ఇందులో డార్లింగ్ సరికొత్త లుక్ లో కనిపించనున్నారు. త్వరలోనే ఈ మూవీ అడియన్స్ ముందుకు రానుంది. అలాగే కల్కి పార్ట్ 2 షూటింగ్ కూడా స్టార్ట్ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
యూట్యూబ్‏లో మ్యూజిక్ సెన్సేషన్.. అప్పుడే ఆ పాటలను బయటకు తీస్తా..
యూట్యూబ్‏లో మ్యూజిక్ సెన్సేషన్.. అప్పుడే ఆ పాటలను బయటకు తీస్తా..
గంజి నీటితో గ్లోయింగ్ స్కిన్, సిల్కీ హెయిర్.. మీరు మిస్సవుతున్న..
గంజి నీటితో గ్లోయింగ్ స్కిన్, సిల్కీ హెయిర్.. మీరు మిస్సవుతున్న..
ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ హైవే.. త్వరలోనే పనులు ప్రారంభం
ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ హైవే.. త్వరలోనే పనులు ప్రారంభం
ఆ స్టార్ హీరో కోసం అనుకున్న కథ.. ఇప్పుడు విజయ్ చేస్తున్నాడు
ఆ స్టార్ హీరో కోసం అనుకున్న కథ.. ఇప్పుడు విజయ్ చేస్తున్నాడు
జిమ్‌కి వెళ్లకుండానే బరువు తగ్గించుకునే సూపర్ టిప్స్
జిమ్‌కి వెళ్లకుండానే బరువు తగ్గించుకునే సూపర్ టిప్స్
బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. ఆరుగురు దుర్మరణం..
బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. ఆరుగురు దుర్మరణం..
కలలలో నెమళ్లు కనిపిస్తే ఏం జరుగుతుంది? శుభమా లేదా అశుభమా? నిజం..
కలలలో నెమళ్లు కనిపిస్తే ఏం జరుగుతుంది? శుభమా లేదా అశుభమా? నిజం..
పహల్గామ్‌లో భద్రత కట్టుదిట్టం.. పోలీసుల నిరంతర నిఘా..
పహల్గామ్‌లో భద్రత కట్టుదిట్టం.. పోలీసుల నిరంతర నిఘా..
కశ్మీర్ అభివృద్ధికి అతిపెద్ద ఎదురుదెబ్బ.. పహల్గామ్ ఉగ్రదాడిపై..
కశ్మీర్ అభివృద్ధికి అతిపెద్ద ఎదురుదెబ్బ.. పహల్గామ్ ఉగ్రదాడిపై..
అప్పుడు ఛీకొట్టారు.. ఇప్పుడు చేతులెత్తి దండం పెట్టారు..
అప్పుడు ఛీకొట్టారు.. ఇప్పుడు చేతులెత్తి దండం పెట్టారు..