ఈషా ఎదురుచూపులు.. సాలిడ్ వెయిట్ కోసం ఎదురుచూస్తున్న భామ

Rajeev 

21 April 2026

instagram

తెలుగు ముద్దుగుమ్మ ఈషా రెబ్బా.. తన అందంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఎప్పటి నుంచో సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తుంది ఈ భామ.

వరుసగా సినిమాలు చేస్తున్నా హిట్స్ మాత్రం అందుకోలేకపోతోంది ఈ చిన్నది. హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే సెకండ్ హీరోయిన్ గానూ మెప్పిస్తుంది. 

చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ వయ్యారికి ఇప్పటివరకు సరైన బ్రేక్ మాత్రం రాలేదు.

అలాగే పెద్ద స్టార్ హీరోల సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. ఒక్క హిట్ పడితే కెరీర్ టర్న్ అవుతుందని ఎదురుచూస్తుంది ఈ అందాల భామ. 

అంతకు ముందు ఆ తర్వాత సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు.. ఆతర్వాత వరుసగా  నటించింది.

కానీ అనుకుంత గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ఆ తర్వాత ఎన్టీఆర్ సినిమాలో నటించింది. ఈ సినిమాతో మంచి క్రేజ్ వచ్చింది.

ఇటీవలే తరుణ్ భాస్కర్ తో ఓ సినిమా చేసింది. కానీ ఆ సినిమా అనుకుంత హిట్ అవ్వలేదు. దాంతో ఈషాకు ఎదురుచూపులు తప్పడం లేదు.