AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాజశేఖర్‌తో జగన్‌ను నటించమని అడిగా.. అందుకు ఆయన..?

రాజశేఖర్‌తో జగన్‌ను నటించమని అడిగా.. అందుకు ఆయన..?

Phani CH
|

Updated on: Apr 21, 2026 | 1:08 PM

Share

యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ నటించిన 'ఎవడైతే నాకేంటి' చిత్రం విజయంలో కీలక పాత్ర పోషించిన డైరెక్టర్ వి. సముద్ర ఇటీవల ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఈ సినిమాలో ముఖ్యమంత్రి పాత్ర కోసం అప్పటి యువ నాయకుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిని సంప్రదించారట. జగన్ సున్నితంగా తిరస్కరించినప్పటికీ, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సీక్రెట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో ‘ఎవడైతే నాకేంటి’ ఒకటి. డైరెక్టర్ వి. సముద్ర తెరకెక్కించిన ఈ సినిమా 2007లో విడుదలై మంచి కలెక్షన్లు రాబట్టింది. హీరో రాజశేఖర్ కెరీర్ లో మర్చిపోలేని చిత్రంగా మిగిలిపోయింది. పొలిటిక్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో హీరో రాజశేఖర్ మేజర్ గానూ, హోమ్ మినిస్టర్ గానూ రెండు పాత్రల్లోనూ అదరగొట్టారు. అలాగే ఆయన తండ్రి పాత్రలో సీనియర్ నటుడు రఘువరన్ విద్యాశాఖ మంత్రి పాత్రలో ఆకట్టుకున్నారు. ఈ సినిమా కథ మొత్తం ముఖ్యమంత్రి పాత్ర చుట్టే తిరుగుతుంది. ఈ పాత్రలో సీనియర్ నటుడు గిరిబాబు నటించారు. అయితే ఈ పాత్ర కోసం డైరెక్టర్ సముద్ర రియల్ పొలిటీషియన్ ను తీసుకుందామని అనుకున్నారట. అప్పటికి ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్సార్ కుమారుడు వైఎస్ జగన్ తో ఈ పాత్ర చేయిద్దామని అనకున్నారట. ఈ విషయాన్ని ఆయనే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ‘ఎవడైతే నాకేంటి’ సినిమాలో ఒరిజినల్ పొలిటీషియన్లను పెడదామనుకున్నాను. అందుకు తగ్గట్టుగానే ముగ్గురు, నలుగురిని రియల్ పొలిటీషియన్లను తీసుకున్నాం అంటూ డైరెక్టర్ సముద్ర చెప్పుకొచ్చారు. తన టీంతో ముఖ్యమంత్రి క్యారెక్టర్ ను ఎవరిని తీసుకుందాం అని అనుకుంటుంటే.. జగన్ పేరు చెప్పారని.. గుర్తు చేసుకున్నాడు. జగన్ దగ్గర పని చేస్తున్న సురేశ్ అనే వ్యక్తిని కలిసి విషయం చెప్పానని.. దీంతో జగన్‌ను అతను పరిచయం చేస్తానని చెప్పాడని.. సముద్ర చెప్పుకొచ్చాడు. అప్పుడు జగన్ సాగర్ సొసైటీ హౌస్ లో ఉండేవారని.. ఆయన ఇంటికి వెళ్లి తన సినిమాలో సీఎం క్యారెక్టర్ లో నటించాలని అడగగా.. అందుకు జగన్‌ మొదట నవ్వారని సముద్ర గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత ‘సారీ అండి.. నాకు సినిమాలు చేయడం ఇష్టం లేదు’.. బట్..ఆ పాత్ర కోసం నన్ను అప్రోచ్ అయ్యినందుకు చాలా థ్యాంక్స్ అని జగన్ చెప్పినట్టు సముద్ర చెప్పుకొచ్చారు. ఆ తర్వాత తన సినిమా వివరాల గురించి అడిగారని.. మూవీ విజయవంతం కావాలని ఆకాంక్షించారని సముద్ర అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మభ్యపెట్టి చిన్నారిని తీసుకెళ్లిన కామాంధుడు.. ఆ తర్వాత

తుపాకులతో బ్యాంకుకు వచ్చారు.. 20 నిమిషాల్లో దోచేశారు

‘అమ్మా, నేను పాసయ్యా’.. మనసుల్ని గెలిచిన వీడియో

దోమల బెడద మధ్యే డ్యూటీ.. సెక్యూరిటీ గార్డ్ వీడియో వైరల్!

అత్తను కాపాడేందుకు కోడలి సాహసం.. ఏం చేసిందో చూడండి

Follow Us