ఎన్ని సినిమాల్లో నటించామన్నది కాదు, ఎలాంటి సినిమాలు చేశాం అన్నది ముఖ్యం

Rajeev 

21 April 2026

instagram

హీరోయిన్ శివాని నాగారం గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. షార్ట్ ఫిల్మ్స్ నుంచి సినీరంగంలోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ.

 ఒక్క సినిమాతోనే సెన్సేషన్ అయ్యింది. లిటిల్ హార్ట్స్ సినిమాతో తెలుగులో పాపులర్ అయ్యింది.

ఇటీవలే హే బల్‌వంత్‌ అనే సినిమాలో నటించింది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ.

తన ప్రయాణం, కెరీర్ ఎదుగుదలపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన కెరీర్ వృద్ధి గురించి మాట్లాడుతూ,

2024లో నటిగా మంచి అరంగేట్రం చేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నానని, 2025 నాటికి మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నానని తెలిపింది.

 2026 నాటికి పూర్తి కమర్షియల్ నటిగా మారుతున్నట్లు అనిపిస్తుందని శివాని నాగారం చెప్పుకొచ్చింది.తాను సినిమాల ఎంపికలో “క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ”కి ప్రాధాన్యత ఇస్తానని.. 

ఎన్ని సినిమాల్లో నటించామన్నది కాదని, ఎలాంటి కంటెంట్ ఉన్న సినిమాల్లో నటించామన్నదే ముఖ్యమని నమ్ముతానని వెల్లడించారు.