AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Renu Desai: ‘చేతులెత్తి మొక్కుతున్నా.. ప్లీజ్ సాయం చేయండి’.. రేణు దేశాయ్ ఎమోషనల్.. ఏమైందంటే?

రవితేజ నటించిన టైగర్ నాగేశ్వర రావు సినిమాతో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆమె మళ్లీ సినిమాల్లో బిజీ అవుతుందనుకున్నారు. కానీ అదేమీ జరగలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉండే రేణు దేశాయ్ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను అందులో షేర్ చేస్తుంటుంది.

Renu Desai: 'చేతులెత్తి మొక్కుతున్నా.. ప్లీజ్ సాయం చేయండి'.. రేణు దేశాయ్ ఎమోషనల్.. ఏమైందంటే?
Acress Renu Desai
Basha Shek
|

Updated on: Aug 11, 2024 | 6:38 PM

Share

ప్రముఖ నటి, దర్శకురాలు రేణు దేశాయ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు బద్రీ, జానీ సినిమాలతో ఆడియెన్స్ ను అలరించిన ఆమె పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది. ఇక విడాకుల తర్వాత సింగిల్ మదర్ గానే లైఫ్ ను లీడ్ చేస్తోంది. ఇటీవల రవితేజ నటించిన టైగర్ నాగేశ్వర రావు సినిమాతో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆమె మళ్లీ సినిమాల్లో బిజీ అవుతుందనుకున్నారు. కానీ అదేమీ జరగలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉండే రేణు దేశాయ్ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను అందులో షేర్ చేస్తుంటుంది. ముఖ్యంగా ఆమెకు సామాజిక స్పృహ చాలా ఎక్కువ. సామాజిక అంశాలపై తరచూ స్పందిస్తూ ఉంటుంది. అలాగే సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉంటుంది. పర్యావరణ కార్యకర్తగా, జంతు ప్రేమికురాలిగా ప్రకృతి, మూగజీవాల పై తన ప్రేమను చూపిస్తుంటుంది. ఇందుకోసం తన వంతు సాయం చేయడంతో పాటు విరాళాలు కూడా సేకరిస్తుంటంది. మూగ జీవాల కోసం గతంలో ఎన్నో సార్లు సాయం చేసిన ఆమె తాజాగా సోషల్ మీడియా వేదికగా మరొక పోస్ట్ పెట్టంది. కుక్క పిల్లలకు డొనేషన్‌గా రైస్ కావాలంటూ అందులో తన ఫాలోవర్లను అభ్యర్థించింది.

‘అర్జెంట్ రిక్వెస్ట్.. మా కుక్కలకు రేషన్ బియ్యం కావాలి ఎవరైనా మాకు హెల్ప్‌ చేయగలరా, ప్లీజ్ మాకు ప్రతి నెలా 300 కేజీల బియ్యం అవసరమవుతూ ఉంటుంది. 4 మంది సభ్యులున్న కుటుంబానికి ప్రభుత్వం నుండి 24 కేజీల బియ్యం అందుతుంది. కాబట్టి దయచేసి మీరు మాకు విరాళం ఇవ్వగలరా? అలా 10 కుటుంబాలు అందిస్తే.. కుక్క పిల్లలకు ఉపయోగకరంగా ఉంటుంది. దయచేసి మీ రిలేటివ్స్, ఫ్రెండ్స్ తో ఈ విషయాన్ని షేర్ చేయండి’ అంటూ తన పోస్ట్ లో రాసుకొచ్చింది రేణు దేశాయ్. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది.

ఇవి కూడా చదవండి

పెట్ డాగ్స్ తో రేణు దేశాయ్.. వీడియో ఇదిగో..

View this post on Instagram

A post shared by renu desai (@renuudesai)

అకిరా నందన్, ఆద్యలపై  రేణు దేశాయ్ ఎమోషనల్ పోస్ట్..

View this post on Instagram

A post shared by renu desai (@renuudesai)

View this post on Instagram

A post shared by renu desai (@renuudesai)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.