AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంగారం కంటే ఖరీదైన ఈ సముద్రపు నిధి గురించి మీకు తెలుసా? అయితే, ఇదో అసహ్యకరమైన పదార్థం!

ప్రపంచవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక చిన్న ఆభరణాన్ని కొనడానికి కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సి వస్తుంది. కానీ, వీటన్నింటికంటే ఎక్కువ ధరకు అమ్ముడయ్యే వస్తువు ఒకటి ఉందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. సముద్రంలో తేలియాడే ఒక అసహ్యకరమైన పదార్థం బంగారం, వెండి కన్నా విలువైనది. ఇది దొరికితే జాలర్ల రాత మారిపోయి రాత్రికి రాత్రే కోటీశ్వరులు అవుతారు గ్యారంటీ!

బంగారం కంటే ఖరీదైన ఈ సముద్రపు నిధి గురించి మీకు తెలుసా? అయితే, ఇదో అసహ్యకరమైన పదార్థం!
Whale Vomit Price
Jyothi Gadda
|

Updated on: Apr 21, 2026 | 8:06 PM

Share

సముద్రం అపారమైన సంపదకు నిలయం. ఒక్కోసారి జాలర్ల వలకు చేపలు కాకుండా మరేదో తగులుతుంది.. అది వారి జీవితాలనే మార్చేస్తుంది. అదే అంబర్‌గ్రిస్. దీనిని సాధారణ భాషలో వేల్ వాంతి అని పిలుస్తారు. దీని విలువ వింటే మీరు ఆశ్చర్యపోవాల్సిందే! సముద్రంలో దొరికే అత్యంత విలువైన వస్తువులలో ఒకటైన వేల్ వాంతి (Whale Vomit) లేదా అంబర్‌గ్రిస్ (Ambergris) కి సంబంధించిన ఆసక్తికరమైన, దిగ్భ్రాంతికరమైన వివరాలు ఇక్కడ ఉన్నాయి.

అంబర్‌గ్రిస్ అంటే ఏమిటి?:

ఇది స్పర్మ్ వేల్ చేపల కడుపులో తయారవుతుంది. వేల్ చేపలు సముద్రంలోని స్క్విడ్ వంటి జీవులను తిన్నప్పుడు, వాటి శరీరంలోని జీర్ణం కాని భాగాల నుండి రక్షణ పొందేందుకు వేల్ జీర్ణవ్యవస్థ ఒక మైనం వంటి పదార్థాన్ని స్రవిస్తుంది. ఇది నోటి ద్వారా లేదా వ్యర్థాల ద్వారా సముద్రంలోకి చేరుతుంది. సముద్రపు ఉప్పు నీరు, సూర్యరశ్మి తగలడం వల్ల ఇది కాలక్రమేణా రాయిలా గట్టిగా మారి సువాసనను వెదజల్లుతుంది.

ఎందుకు ఇంత ఖరీదు?:

అంబర్‌గ్రిస్ అంత ఖరీదు అవ్వడానికి ప్రధాన కారణం పర్ఫ్యూమ్ పరిశ్రమ. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన పర్ఫ్యూమ్ బ్రాండ్లు దీనిని వాడుతాయి. పర్ఫ్యూమ్ సువాసన గాలిలో త్వరగా ఆవిరి కాకుండా ఎక్కువ సేపు చర్మంపై నిలిచి ఉండటానికి ఇది సహాయపడుతుంది. దీనికి ప్రత్యామ్నాయంగా సింథటిక్ పదార్థాలు ఉన్నప్పటికీ, సహజమైన అంబర్‌గ్రిస్‌కు ఉన్న డిమాండ్ వేరు.

ఇవి కూడా చదవండి

భారతదేశంలో వన్యప్రాణి సంరక్షణ చట్టం (Wildlife Protection Act, 1972) ప్రకారం స్పర్మ్ వేల్స్ సంరక్షించబడిన జీవులు. అందువల్ల, అంబర్‌గ్రిస్‌ను సేకరించడం లేదా విక్రయించడం భారత్‌లో నేరం. చాలా దేశాల్లో దీనిపై నిషేధం ఉన్నప్పటికీ, అంతర్జాతీయ బ్లాక్ మార్కెట్‌లో దీనికి భారీ ధర పలుకుతుంది. ఒక జంతువు వ్యర్థం ఇంత ఖరీదైనదిగా మారడం ప్రకృతి వింతలలో ఒకటి. అందుకే అంబర్‌గ్రిస్ దొరికిన జాలర్లను ఇది రాత్రికి రాత్రే లక్షాధికారులను, కోటీశ్వరులను చేస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us