AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: భలే ట్రిక్‌.. బంగాళాదుంపల పొట్టు తీయటం ఇంత ఈజీనా… ఒక్క సెకనులో పూర్తైందే..?

కిచెన్‌లో బంగాళాదుంపలతో వంట చేయాలంటే వాటి పొట్టు తీయడమే పెద్ద పనిగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఉడకబెట్టిన దుంపలు వేడిగా ఉన్నప్పుడు వాటిని వలవడం కష్టమవుతుంది. ఉడకబెట్టిన బంగాళాదుంపల పొట్టు తీయడం అనేది కొంత సమయం తీసుకునే పని, ఒక్కోసారి వేడి వల్ల ఇబ్బందిగా కూడా ఉంటుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక సింపుల్ ట్రిక్ ఈ పనిని ఎంత సులభం చేసిందో చూస్తే అవాక్కవ్వాల్సిందే..

Watch: భలే ట్రిక్‌.. బంగాళాదుంపల పొట్టు తీయటం ఇంత ఈజీనా... ఒక్క సెకనులో పూర్తైందే..?
Potato Peeling Hack
Jyothi Gadda
|

Updated on: Apr 21, 2026 | 6:17 PM

Share

ఉడకబెట్టిన బంగాళాదుంపల పొట్టును (Boiled Potatoes) చిటికెలో, అత్యంత సులభంగా వలవడానికి ఒక వినూత్నమైన వైరల్ హ్యాక్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ ట్రిక్ ద్వారా వేడివేడి బంగాళాదుంపల పొట్టును కూడా చేతులు కాలకుండా క్షణాల్లో తీసేయవచ్చు. దీంతో మీ వంటింటి పని మరింత సులభంగా పూర్తి చేస్తారు. అదేలాగంటే..

బంగాళాదుంపలను ఉడకబెట్టడానికి ముందే, ఒక చాకు తీసుకుని దుంప మధ్యలో చుట్టూరా పల్చని గాటు పెట్టండి. జాగ్రత్త, మరీ లోతుగా కోయకూడదు, కేవలం పొట్టుపై మాత్రమే గాటు పడాలి. ఇక, ఇప్పుడు ఎప్పటిలాగే కుక్కర్‌లో లేదా గిన్నెలో వేసి ఉడకబెట్టండి. దుంపలు ఉడికిన తర్వాత, వాటిని వేడి నీటి నుండి తీసి వెంటనే ఐస్ వాటర్ లేదా చల్లని నీటిలో వేయండి. దీనిని థర్మల్ షాక్ అంటారు. ఇది పొట్టును దుంప నుండి విడదీస్తుంది. ఇప్పుడు దుంపను చేతిలోకి తీసుకుని, మనం పెట్టిన గాటు వద్ద రెండు వైపులా వేళ్లతో పట్టుకుని లాగండి. ఆశ్చర్యకరంగా పొట్టు ఒకేసారి విడిపోయి వచ్చేస్తుంది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

View this post on Instagram

A post shared by @zanzaniit_tadka

ఈ సింపుల్‌ హ్యాక్ వల్ల మీకు భలే ప్రయోజనాలు ఉన్నాయి. ఎలాగంటే.. కిలోల కొద్దీ బంగాళాదుంపల పొట్టును నిమిషాల్లో తీసేయవచ్చు. గోళ్లతో గీకడం వల్ల వచ్చే నష్టం ఉండదు, దుంప ఆకారం దెబ్బతినదు. వేడి దుంపల వల్ల వేళ్లు కాలే ప్రమాదం ఉండదు. వంట గదిలో ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటించడం వల్ల పని ఒత్తిడి తగ్గడమే కాకుండా వంట చేయడం ఆనందంగా మారుతుంది. ఈసారి మీరు బంగాళాదుంపలు ఉడకబెట్టినప్పుడు ఈ వైరల్ హ్యాక్‌ను తప్పకుండా ప్రయత్నించండి.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
రామ తులసి, కృష్ణ తులసి మధ్య తేడా ఏమిటి? వాటిని ఎలా గుర్తించాలి?
రామ తులసి, కృష్ణ తులసి మధ్య తేడా ఏమిటి? వాటిని ఎలా గుర్తించాలి?
భలే ట్రిక్‌.. బంగాళాదుంపల పొట్టు తీయటం ఇంత ఈజీనా..?
భలే ట్రిక్‌.. బంగాళాదుంపల పొట్టు తీయటం ఇంత ఈజీనా..?
అల్లు అర్జున్‏కు ఢిల్లీ హైకోర్టు రక్షణ..
అల్లు అర్జున్‏కు ఢిల్లీ హైకోర్టు రక్షణ..
100 కొంటే 400 షేర్లు ఫ్రీ.. లక్షను రూ.10 లక్షలు చేసే స్టాక్..
100 కొంటే 400 షేర్లు ఫ్రీ.. లక్షను రూ.10 లక్షలు చేసే స్టాక్..
ఇప్పటికీ ఆ దృశ్యం నీడలా వెంటాడుతోంది! కొడుకు కోసం బెంగళూరుడాక్టర్
ఇప్పటికీ ఆ దృశ్యం నీడలా వెంటాడుతోంది! కొడుకు కోసం బెంగళూరుడాక్టర్
SRH vs DC Live Score: హ్యాట్రిక్ విక్టరీపై ఎస్‌ఆర్‌హెచ్ గురి..
SRH vs DC Live Score: హ్యాట్రిక్ విక్టరీపై ఎస్‌ఆర్‌హెచ్ గురి..
పోలీస్ ఆఫీసర్‌కే కుళ్లిన మటన్ కీమా పంపిన రెస్టారెంట్.. కట్ చేస్తే
పోలీస్ ఆఫీసర్‌కే కుళ్లిన మటన్ కీమా పంపిన రెస్టారెంట్.. కట్ చేస్తే
యూట్యూబ్‏లో మ్యూజిక్ సెన్సేషన్.. అప్పుడే ఆ పాటలను బయటకు తీస్తా..
యూట్యూబ్‏లో మ్యూజిక్ సెన్సేషన్.. అప్పుడే ఆ పాటలను బయటకు తీస్తా..
గంజి నీటితో గ్లోయింగ్ స్కిన్, సిల్కీ హెయిర్.. మీరు మిస్సవుతున్న..
గంజి నీటితో గ్లోయింగ్ స్కిన్, సిల్కీ హెయిర్.. మీరు మిస్సవుతున్న..
ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ హైవే.. త్వరలోనే పనులు ప్రారంభం
ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ హైవే.. త్వరలోనే పనులు ప్రారంభం