AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manchu Vishnu: మంచువారబ్బాయి మంచి మనసు.. కూతురి పుట్టిన రోజున వారికి రూ.10 లక్షల విరాళమిచ్చిన మంచు విష్ణు

టాలీవుడ్ ప్రముఖ నటుడు మంచు విష్ణు ప్రస్తుతం మా అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. అదే సమయంలో తన డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్ప షూటింగ్ తో బిజీ బిజీగా ఉంటున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, దేవరాజ్ తదితర టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అగ్ర తార‌లు న‌టిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. సినిమాల సంగతి పక్కన పెడితే.

Manchu Vishnu: మంచువారబ్బాయి మంచి మనసు.. కూతురి పుట్టిన రోజున వారికి రూ.10 లక్షల విరాళమిచ్చిన మంచు విష్ణు
Manchu Vishnu Family
Basha Shek
|

Updated on: Aug 10, 2024 | 6:56 PM

Share

టాలీవుడ్ ప్రముఖ నటుడు మంచు విష్ణు ప్రస్తుతం మా అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. అదే సమయంలో తన డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్ప షూటింగ్ తో బిజీ బిజీగా ఉంటున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, దేవరాజ్ తదితర టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అగ్ర తార‌లు న‌టిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. సినిమాల సంగతి పక్కన పెడితే.. ఈ మధ్యన మా అధ్యక్షుడిగా ఫుల్ యాక్టివ్ అయ్యారు మంచు విష్ణు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్లు, సినీ ఆర్టిస్టుల మీద సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఫేక్ న్యూస్‌లు, ట్రోలింగ్స్ చేసేవారిపైన క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా సినిమా నటీనటులపై అసభ్యకరమైన వీడియోలతో ట్రోల్స్ చేస్తోన్న 18 యూట్యూబ్ ఛానెళ్లను బ్లాక్ చేయించారు. విష్ణు చేపట్టిన ఈ చర్యలను టాలీవుడ్‌తో పాటు ఇతర ఇండస్ట్రీలకు చెందిన నటీనటులు కూడా ప్రశంసించారు. తాజాగా మా అధ్యక్షునిగా మరోసారి గొప్ప మనసు చాటుకున్నాడు మంచు వారబ్బాయి. తన కూతురు ఐరా విద్య పుట్టిన రోజును పురస్కరించుకుని మా అసోసియేషన్‌కి పది లక్షల విరాళాన్ని ప్రకటించారు. అసోసియేషన్‌లో ఆర్థికంగా వెనుకబడిన కళాకారుల సంక్షేమం కోసం ఈ మొత్తాన్ని అందించారు. కళాకారులకు సహాయం చేయడం, వారికి అవసరమైన సౌకర్యాలు, సంరక్షణ అందేలా చేయడం కోసం రూ. 10 లక్షలు వినియోగించునున్నట్లు మంచు విష్ణు తెలిపారు. దీనికి సంబంధించి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

మంచు విష్ణు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కూతురి పుట్టిన రోజున చాలా మంచి నిర్ణయం తీసుకుంటున్నావంటున్నారు. ఇక కన్నప్ప సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాకు మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్‌కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మోహన్ బాబు, ఆర్. శరత్ కుమార్,మధుబాల, బ్రహ్మానందం, రఘుబాబు, ప్రీతి ముకుందన్, శివ బాలాజీ, కౌశల్, సురేఖా వాణి, సప్తగిరి తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. సుమారు రూ. 100 కోట్లకు పైగా బడ్జెట్ తో మోహన్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us