Telangana: రేవంత్, కేసీఆర్.. మధ్యలో బీజేపీ.. వార్ జోన్ షురూ అయినట్టేనా?
ముఖ్యంగా రేవంత్ మార్క్ ఆఫ్ గవర్నెన్స్‌ని టార్గెట్ చేశారు మాజీ సీఎం కేసీఆర్. కాంగ్రెస్ పథకాల్ని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేశారు. ఒక్కో పథకాన్ని గుర్తు చేస్తూ పాయింట్ టూ పాయింట్ నిగ్గదీసే ప్రయత్నం చేశారు. జనం కూడా రేవంత్ ప్రభుత్వంపై మొహం మొత్తి, తన రీఎంట్రీని కోరుకుంటున్నారు అన్నట్టుగా సాగింది కేసీఆర్ స్పీచ్.

2023 నవంబర్ 30. తెలంగాణ అసెంబ్లీ గత రణరంగం తారీఖు. ప్రభుత్వ మార్పిడి జరిగి.. పదేళ్ల బీఆర్ఎస్ పాలన పోయి, విడిపడ్డ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తొలిసారి ఛాన్స్ దక్కించుకుని గాంధీభవన్ వెయ్యిక్యాండిళ్లతో వెలిగి, సరిగ్గా రెండున్నరేళ్లయింది. మలి విడత రణరంగానికి సరిగ్గా ఇంకో రెండున్నరేళ్ల గ్యాపుంది. నడిమధ్య సంధికాలంలో తెలంగాణలో రాజకీయ రణభేరి మోగినట్టయింది. మళ్లీ ప్రభుత్వమార్పిడి తప్పదని వాళ్లు, మీది ముగిసిన శకం అని వీళ్లు.. పవర్‌గేమ్‌ని హైటెంపరేచర్లతో షురూ చేశారు. తెలంగాణ గడ్డను వార్‌జోన్‌గా మార్చేశారు. ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇకమీదట ఇంకో లెక్క అని సౌండిచ్చారు ప్రజంట్ సీఎం అండ్ మాజీ సీఎం. ఈ నిప్పుల్లో ఉప్పుగల్లు వేసిన బీజేపీ నేతలు, వాళ్ల పాత్రలో వాళ్లూ జీవిస్తున్నారు. సోమవారం సాయంత్రం.. ఒకే సమయంలో జరిగిన రెండు సభలు తెలంగాణలో రాజకీయ సెగలు రేపాయి. సీనియర్ కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డిని పార్టీలో చేర్చుకునే జగిత్యాల ప్రజాశీర్వాద సభలో కాంగ్రెస్‌ను దునుమాడేశారు మాజీ సీఎం కేసీఆర్. కాంగ్రెస్ పోవాలి, బీఆర్‌ఎస్ రావాలి అని గట్టిగానే స్లోగన్లిచ్చారు. అదే ఉత్తర తెలంగాణలో భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని నస్తురుపల్లి బహిరంగ సభలో కేసీఆర్‌తో కయ్యానికి సై అన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. రైతుభరోసా పైసలు వేసే కార్యక్రమమే ఐనా, అక్కడ రాజకీయ మతాబులే బలంగా పేలాయి. చాలా గ్యాప్ తర్వాత అధికార ప్రతిపక్షాల మధ్య వన్‌టువన్ వార్ జరిగినట్టైంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీఘోష్ రిపోర్ట్...
