AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: కోట్లు విలువైన బంగ్లాకే కాదు.. ఓ దీవికే ఆ హీరోయిన్ ఓనర్.. ఆస్తులు తెలిస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే..

ఇండియా సినీ పరిశ్రమలో ఆ హీరోయిన్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఆ బ్యూటీ.. అటు స్పెషల్ సాంగ్స్ లోనూ మెరిసింది. కానీ కొన్ని నెలలుగా వ్యక్తిగత విషయాలతో నిత్యం వార్తలలో నిలుస్తుంది. అలాగే మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటుంది. కానీ ఇప్పుడు ఆ బ్యూటీ ఆస్తి వివరాలు తెలిసి షాకవుతున్నారు నెటిజన్స్. కోట్లు విలువైన సంపదనే కాకుండా ఏకంగా ఓ దీవికి ఆమె ఓనర్. ఇంతకీ ఎవరా బ్యూటీ అనుకుంటున్నారా..? తనే బీటౌన్ హీరోయిన్

Tollywood: కోట్లు విలువైన బంగ్లాకే కాదు.. ఓ దీవికే ఆ హీరోయిన్ ఓనర్.. ఆస్తులు తెలిస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే..
Actress
Rajitha Chanti
|

Updated on: Aug 10, 2024 | 7:07 PM

Share

పాన్ ఇండియా సినీ పరిశ్రమలో ఆ హీరోయిన్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఆ బ్యూటీ.. అటు స్పెషల్ సాంగ్స్ లోనూ మెరిసింది. కానీ కొన్ని నెలలుగా వ్యక్తిగత విషయాలతో నిత్యం వార్తలలో నిలుస్తుంది. అలాగే మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటుంది. కానీ ఇప్పుడు ఆ బ్యూటీ ఆస్తి వివరాలు తెలిసి షాకవుతున్నారు నెటిజన్స్. కోట్లు విలువైన సంపదనే కాకుండా ఏకంగా ఓ దీవికి ఆమె ఓనర్. ఇంతకీ ఎవరా బ్యూటీ అనుకుంటున్నారా..? తనే బీటౌన్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్..శ్రీలంక నుండి భారతదేశానికి రావడం ద్వారా తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. అయితే, ఈ నటి గ్లామర్ ప్రపంచంలో మొదట మోడలింగ్‌లోకి ప్రవేశించింది. ఆ తర్వాత 2009లో సుజోయ్ ఘోష్ చిత్రం ‘అల్లాదీన్’తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది.

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ 2006లో మిస్ శ్రీలంక యూనివర్స్ పోటీలో గెలిచిన తర్వాత సినిమాల కోసం ముంబై చేరుకుంది. ఆ తర్వాత కొన్నాళ్లకే బాలీవుడ్ టాప్ నటీమణుల జాబితాలో జాక్వెలిన్ చేరిపోయింది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ 2021 సంవత్సరంలో ముంబైలోని జుహు ప్రాంతంలో ఒక విలాసవంతమైన 5-BHK అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసింది. నివేదికల ప్రకారం దీని ధర రూ.7 కోట్లు. ముంబైలోని ఈ విలాసవంతమైన ఇల్లు కాకుండా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కి శ్రీలంకలో ఒక ప్రైవేట్ ద్వీపం కూడా ఉన్నట్లు టాక్ నడుస్తుంది. అయితే దీనిపై సరైన క్లారిటీ లేదు. అలాగే జాక్వెలిన్ వద్ద రోవర్ వోగ్ ధర రూ.2.11 కోట్లు, హమ్మర్ హెచ్2 ధర రూ.75 లక్షలు.

ఇది కాకుండా జాక్వెలిన్ వద్ద మెర్సిడెస్ మేబ్యాక్ S500 కూడా ఉంది. భారతదేశంలో దీని ధర దాదాపు రూ.1.86 కోట్లు. ఈ హీరోయిన్ నికర విలువ రూ.116 కోట్లు. జాక్వెలిన్ చివరిసారిగా అక్షయ్ కుమార్ చిత్రం ‘రాట్సేతు’లో కనిపించింది. ఈ చిత్రం 2022 సంవత్సరంలో విడుదలైంది. కొన్ని రోజులుగా మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us