AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: టెర్రస్‌పై ఎక్కువ సేపు ఉంటున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. ఆరా తీస్తే అసలు కథ తెలిసింది..

హైదరాబాద్‌లో ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తన ఇంటి డాబాపై గంజాయి సాగు చేస్తూ పట్టుబడ్డాడు. నాచారానికి చెందిన శశిధర్‌ అనే ఇంజినీర్ గంజాయికి బానిసై ఉద్యోగం వదిలేశాడు. డబ్బు లేక సొంతంగా 17 గంజాయి మొక్కలు పెంచుతుండగా.. ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. ఇదే క్రమంలో గంజాయి అమ్ముతున్న ఇద్దరు బీటెక్ విద్యార్థులు కూడా పట్టుబడ్డారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Hyderabad: టెర్రస్‌పై ఎక్కువ సేపు ఉంటున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. ఆరా తీస్తే అసలు కథ తెలిసింది..
Ganja
Shaik Madar Saheb
|

Updated on: Apr 21, 2026 | 7:56 PM

Share

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. ఆఫీస్ కు వెళ్తుంటాడు.. వస్తుంటాడు.. అందరితో మంచిగానే ఉంటాడు.. పైకి.. ఎంత బుద్ధిమంతుడో అనుకునే లుక్.. ఇంకేముంది .. ఇలాంటి వారిపై ఎవరికైనా అనుమానం కలుగుతుందా..? అస్సలు కలగదు.. కానీ.. గురుడు మాత్రం.. టెర్రస్ పై అందరూ నోరెళ్లబెట్టే పనిచేశాడు.. ఏకంగా.. గంజాయ్ మొక్కలు పెంచుతూ.. సరదాగా గంజాయ్ తాగుతూ ఎంజాయ్ చేస్తుంటాడు.. అయితే.. చాలా రోజుల తర్వాత బయటపడిన ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్ నగరంలో సంచలనంగా మారింది. ఈ ఘటన హైదరాబాద్ నాచారంలో వెలుగు చూసింది.. ఇంటి డాబాపై గంజాయి మొక్కలను సాగు చేస్తున్న ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను ఏప్రిల్ 20, సోమవారం నాడు నిషేధ, ఎక్సైజ్ శాఖ అధికారులు అరెస్టు చేశారు. పోలీసులు సుమారు 10 కిలోగ్రాముల గంజాయిని.. ఉత్పత్తి చేయగల 17 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని నాచారంలోని తూర్పు గాంధీనగర్ నివాసి అయిన సి.హెచ్. శశిధర్‌గా గుర్తించారు.

ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆర్ కిషన్ ప్రకారం.. శశిధర్ గంజాయికి బానిసయ్యాడు.. తన జీతం మొత్తాన్ని ఆ మత్తుపదార్థం కోసం ఖర్చు చేసేవాడు.. అలా గంజాయ్ మత్తుకు అలవాటుపడి.. చివరికి తన సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని సైతం వదిలేశాడు.. గంజాయి కొనడానికి డబ్బులు లేకపోవడంతో, తన సొంత ఇంటి డాబాపై ఆ మొక్కలను పెంచడం ప్రారంభించాడు.

వీడియో చూడండి..

స్వాధీనం చేసుకున్న మొక్కలలో కొన్ని అప్పటికే పూయడం ప్రారంభించగా, మరికొన్ని మూడు మీటర్ల ఎత్తుకు పెరిగాయి. శశిధర్‌ను అరెస్టు చేసి ఘట్‌కేసర్ ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.

గంజాయి అమ్ముతూ పట్టుబడిన బి.టెక్ విద్యార్థులు

ఇదిలా ఉండగా, సీఐ బాలరాజు నేతృత్వంలోని అదే బృందం మేడపాటి నగర్‌లో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు బీటెక్ విద్యార్థులను అరెస్టు చేసిందది. ఇద్దరు వ్యక్తుల నుంచి 480 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో బండి అరుణ్ కుమార్, బి ఆశిష్‌లను అరెస్టు చేసి ఘట్‌కేసర్ ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!
కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!
పాన్ కార్డులో ఫొటోను ఇంట్లో నుంచే నిమిషాల్లో మార్చుకోండి..
పాన్ కార్డులో ఫొటోను ఇంట్లో నుంచే నిమిషాల్లో మార్చుకోండి..