AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎదురుగా పిజ్జా ఉన్నా తినకుండా డైట్..! సినిమా కోసం స్ట్రిక్ట్ డైట్‌ ఫాలో అవుతున్న స్టార్

నటీనటులు తెరపై కనిపించే ఆ కొన్ని నిమిషాల గ్లామర్ వెనుక నెలల తరబడి చేసే క్రమశిక్షణతో కూడిన సాధన ఉంటుంది. గతంలో వచ్చిన 'తేరే ఇష్క్ మే' సినిమా మానసికంగా తనను ఎంతో అలసిపోయేలా చేసిందని, అందుకే కొంచెం సరదాగా ఉండే సినిమా చేయాలనే ఉద్దేశంతో 'కాక్‌టెయిల్ 2' ఒప్పుకున్నానని కృతి తెలిపింది. తాజాగా ఓ ఇంటర్య్వూలో కృతి, షూటింగ్ సమయంలో తను పాటించిన కఠినమైన డైట్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

ఎదురుగా పిజ్జా ఉన్నా తినకుండా డైట్..! సినిమా కోసం స్ట్రిక్ట్ డైట్‌ ఫాలో అవుతున్న స్టార్
Kriti Sanon's Strict Calorie Deficient Diet For Cocktail 2.jpg
Nikhil
|

Updated on: Apr 21, 2026 | 7:50 PM

Share

హోమీ అదాజానియా దర్శకత్వంలో రాబోతున్న ‘కాక్‌టెయిల్ 2’ ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుండి సోషల్ మీడియాలో కృతి సనన్ మేకోవర్ గురించే చర్చ జరుగుతోంది. ‘కాక్‌టెయిల్’ మొదటి భాగంలో దీపికా పదుకొణె పోషించిన ఐకానిక్ ‘వెరోనికా’ పాత్రను గుర్తుకు తెచ్చేలా కృతి కనిపిస్తోంది. టోన్డ్ బికినీ బాడీ నుండి బోహేమియన్ అవుట్‌ఫిట్స్ వరకు ఆమె వేసుకున్న ప్రతి డ్రెస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అయితే, ఈ స్థాయి ఫిట్‌నెస్‌ను సాధించడం వెనుక కృతి పడిన శ్రమ అంతా ఇంతా కాదు.

క్యాలరీ డెఫిసిట్ డైట్

సినిమా కోసం కృతి తన జీవితంలో మొదటిసారి ‘క్యాలరీ డెఫిసిట్’ (తక్కువ క్యాలరీలు తీసుకోవడం) డైట్‌ను అనుసరించింది. విశేషమేమిటంటే, ఈ సినిమా షూటింగ్ ఇటలీలోని సిసిలీలో జరిగింది. ఇటలీ అంటేనే పిజ్జాలు, పాస్తాలకు పెట్టింది పేరు. చుట్టూ నోరూరించే కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే వంటకాలు ఉన్నప్పటికీ, కృతి తన డైట్ విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయలేదు. కేవలం టోన్డ్ లుక్ కోసం, ఒక అథ్లెటిక్ బాడీని సాధించడం కోసం ఆమె ఆ కఠినమైన ఆహార నియమాలను పాటించింది. క్యాలరీ డెఫిసిట్ డైట్ అనేది కేవలం బరువు తగ్గడానికే కాకుండా, శరీరంలోని కొవ్వును తగ్గించి మెటబాలిక్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఎంతో సహాయపడుతుంది.

సైఫ్ అలీ ఖాన్, దీపికా పదుకొణె, డయానా పెంటీ నటించిన ‘కాక్‌టెయిల్’ అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఇప్పుడు వస్తున్న ఈ సీక్వెల్‌లో కృతి సనన్‌తో పాటు షాహిద్ కపూర్, రష్మిక మందన్న నటిస్తున్నారు. కృతి తన అంకితభావంతో సాధించిన ఈ అద్భుతమైన మార్పు సినిమాపై అంచనాలను పెంచేసింది. వెండితెరపై కృతి సనన్ కొత్త అవతారం ప్రేక్షకులను ఏ విధంగా అలరిస్తుందో చూడాలి.

ఈ చిత్రం జూన్ 19, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. గ్లామర్, ఎమోషన్స్, మంచి మ్యూజిక్ కలగలిసిన ఈ సినిమా కృతి కెరీర్‌లో మరో హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. కృతి సనన్ ఫిట్‌నెస్ ప్రయాణం నేటి తరం యువతకు ఒక గొప్ప స్ఫూర్తి అని చెప్పవచ్చు.

Follow Us
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!
కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!
పాన్ కార్డులో ఫొటోను ఇంట్లో నుంచే నిమిషాల్లో మార్చుకోండి..
పాన్ కార్డులో ఫొటోను ఇంట్లో నుంచే నిమిషాల్లో మార్చుకోండి..