AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ITR దాఖలు చేయనున్నారా? అయితే ఈ డాక్యుమెంట్స్‌ రెడీ చేసుకోండి!

2026-27 అసెస్‌మెంట్ సంవత్సరానికి ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ ప్రారంభమైంది. కొత్త ITR ఫారాలు విడుదలయ్యాయి. చివరి నిమిషం తొందరపాటును నివారించడానికి, పాన్, ఆధార్ లింకింగ్, ఫారం 16, 26AS, AIS, పెట్టుబడి రుజువులు వంటి అవసరమైన పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవడం ముఖ్యం.

ITR దాఖలు చేయనున్నారా? అయితే ఈ డాక్యుమెంట్స్‌ రెడీ చేసుకోండి!
Itr Filing
SN Pasha
|

Updated on: Apr 21, 2026 | 7:38 PM

Share

పన్నుల సీజన్ మళ్లీ ప్రారంభమవుతున్న వేళ 2026-27 అసెస్మెంట్ సంవత్సరానికి సంబంధించిన ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్స్‌ ఫైలింగ్‌కు సిద్ధం కావాల్సిన సమయం వచ్చింది. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా ఇప్పటికే కొత్త ITR ఫారాలను విడుదల చేయడంతో, త్వరలో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ దాఖలు ప్రక్రియలు ప్రారంభం కానున్నాయి. అయితే చాలా మంది చివరి నిమిషం వరకు వేచి ఉండడం వల్ల తప్పులు జరిగే ప్రమాదం పెరుగుతోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ముందుగానే పత్రాలను సిద్ధం చేసుకుంటే ఫైలింగ్ ప్రక్రియ సులభంగా పూర్తవుతుంది.

ఈ ప్రక్రియలో మొదట అవసరమయ్యేది పాన్‌ కార్డ్‌. ఇది ఆధార్‌తో లింక్ అయి ఉందో లేదో ముందుగానే చెక్ చేయాలి. అదేవిధంగా ఇ-వెరిఫికేషన్ కోసం మొబైల్ నంబర్, ఇమెయిల్ వివరాలను పన్ను పోర్టల్‌లో అప్డేట్ చేయడం కీలకం. ఉద్యోగుల కోసం Form 16 అత్యంత ముఖ్యమైన పత్రం. ఇందులో జీతం, TDS, అలవెన్సుల వివరాలు ఉంటాయి. ఏడాది మధ్యలో ఉద్యోగం మారిన వారు అన్ని సంస్థల నుంచి ఫారం-16 సేకరించాలి. అలాగే Form 26AS, యాన్యువల్‌ ఇన్ఫర్మెషన్‌ స్టేట్‌మెంట్‌లను డౌన్‌లోడ్ చేసి బ్యాంక్ స్టేట్‌మెంట్‌లతో సరిపోల్చాలి. బ్యాంక్ వడ్డీ, ఇతర ఆదాయాలను మిస్ చేయడం వల్ల తర్వాత నోటీసులు వచ్చే అవకాశం ఉంది.

పన్ను ఆదా చేసుకోవాలనుకునే వారికి పెట్టుబడి రుజువులు కీలకం. లైఫ్‌ ఇన్సూరెన్స్‌, PPF, ELSS, ఆరోగ్య బీమా, పిల్లల ట్యూషన్ ఫీజుల రసీదులు సిద్ధంగా ఉంచాలి. గృహ రుణం ఉన్నవారు బ్యాంక్ నుండి వడ్డీ సర్టిఫికేట్ తీసుకోవాలి. అద్దె ఇంట్లో ఉంటే, రెంట్ అగ్రిమెంట్, రసీదులు అవసరం. అదనంగా ఫ్రీలాన్సింగ్, పెన్షన్, డివిడెండ్లు లేదా ఆస్తి అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయాలను కూడా తప్పకుండా ప్రకటించాలి. షేర్లు, మ్యూచువల్ ఫండ్ల లావాదేవీలకు సంబంధించిన పత్రాలు కూడా అవసరం అవుతాయి. గత ఏడాది ITR కాపీ ఉంటే వివరాలు నమోదు చేయడం సులభమవుతుంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us