AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SRH vs DC Playing XI: టాస్ గెలిచిన ఢిల్లీ.. హైదరాబాద్ టీంలో కీలక మార్పు.. ఎవరొచ్చారంటే?

IPL సన్‌రైజర్స్ హైదరాబాద్‌ vs ఢిల్లీ క్యాపిటల్స్ Playing XI: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ (DC) మధ్య ఐపీఎల్ 31వ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకుంది. అఖిబ్ నబీ స్థానంలో నితీష్ రాణాను ఎంపిక చేసినట్లు అక్షర్ పటేల్ ప్రకటించాడు.

SRH vs DC Playing XI: టాస్ గెలిచిన ఢిల్లీ.. హైదరాబాద్ టీంలో కీలక మార్పు.. ఎవరొచ్చారంటే?
Srh Vs Dc Toss Update
Venkata Chari
|

Updated on: Apr 21, 2026 | 7:12 PM

Share

IPL సన్‌రైజర్స్ హైదరాబాద్‌ vs ఢిల్లీ క్యాపిటల్స్ Playing XI: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ (DC) మధ్య ఐపీఎల్ 31వ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకుంది. అఖిబ్ నబీ స్థానంలో నితీష్ రాణాను ఎంపిక చేసినట్లు అక్షర్ పటేల్ ప్రకటించాడు.

ఈరోజు హైదరాబాద్‌లో వర్షం పడే అవకాశం 55% ఉంది. ప్రస్తుతం పిచ్ కవర్లతో కప్పబడి ఉంది. పాయింట్ల పట్టికలో ఇరు జట్లు చెరో 6 పాయింట్లతో సమంగా ఉన్నప్పటికీ, మెరుగైన రన్ రేట్ కారణంగా హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉంది. ఢిల్లీ తన నాలుగో విజయం కోసం ఎదురుచూస్తోంది. సొంతగడ్డపై వరుసగా మూడో విజయం సాధించాలని హైదరాబాద్ లక్ష్యంగా పెట్టుకుంది.

ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య 26 మ్యాచ్‌లు జరిగాయి. వాటిలో ఎస్ఆర్‌హెచ్ 13, డీసీ 11 గెలిచాయి. ఒక మ్యాచ్ టై కాగా, అందులో ఢిల్లీ గెలుపొందింది, మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది.

ఇరు జట్లు:

ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ XI: పాతుమ్ నిస్సాంక, కేఎల్ రాహుల్(కీపర్), సమీర్ రిజ్వీ, నితీష్ రాణా, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, టి నటరాజన్, లుంగి ఎన్గిడి.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ XI: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా(కీపర్), అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివంగ్ కుమార్, హర్ష్ దూబే, సాకిబ్ హుస్సేన్, ఎషాన్ మలింగ.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us