AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ట్రక్కు పైన తరలింపు.. ఆ ఇంటితో ఐదు తరాల అనుబంధం

పాత ఇల్లు అంటే కొందరికి కేవలం గోడలు, పైకప్పు మాత్రమే. కానీ మరికొందరికి అది తరతరాల జ్ఞాపకాల నిధి. అమెరికాకు చెందిన జసోండ్రా ష్మిత్ తన ముత్తాతకు చెందిన 112 ఏళ్ల పాత ఇంటిని కాపాడుకోవడానికి ఏకంగా రూ.3 కోట్లకు పైగా ఖర్చు చేసింది. ఆ ఇంటిని 10 కిలోమీటర్ల దూరంలోని వ్యవసాయ భూమికి తరలించింది. ఇప్పుడు ఆ ఇంటికి పాత రూపాన్ని తీసుకొచ్చేందుకు మరమ్మతులు చేయిస్తుంది.

ట్రక్కు పైన తరలింపు.. ఆ ఇంటితో ఐదు తరాల అనుబంధం
Woman Shifts Great Grandparents House To Her Husband Family Farm By Road
Sharada V
|

Updated on: Oct 14, 2026 | 10:24 PM

Share

అమెరికాలోని నార్త్ డకోటాలో జసోండ్రా ష్మిత్, ఆమె భర్త జేసన్ ఇద్దరు కుమార్తెలతో కలిసి నివసిస్తున్నారు. జసోండ్రా కుటుంబానికి చెందిన ఓ పాత ఇల్లు అమ్మకానికి వచ్చింది.  1914లో ఆమె ముత్తాత ఫ్రెడెరిచ్  ఆ ఇంటిని సొంతం చేసుకున్నారు.

ఫేస్‌బుక్ కామెంట్‌తో మొదలైన ప్రయత్నం

ఫేస్‌బుక్‌లో బంధువులు రెండు అంతస్తులున్న ఓ పాత ఇంటి గురించి చర్చించడం జసోండ్రా చూసింది. అది తన కుటుంబానికి చెందిన ఇల్లేనని ఆమె గుర్తించింది. వెంటనే బంధువులను సంప్రదించి ఆ ఇంటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపింది.

ఆరు మైళ్ల దూరం.. భారీ యంత్రాలతో ఇంటి తరలింపు

ఇంటి వెడల్పు 30 అడుగులు, పొడవు 60 అడుగులు కావడంతో ఇంటిని కూల్చకుండా మరో చోటుకు తరలించడం అనుకున్నంత సులభం కాలేదు. మొదట ఇంటిని పాత పునాది నుంచి వేరు చేశారు. అనంతరం ఇంటి కింద భారీ స్టీల్ బీమ్ లు అమర్చి, జాక్‌ల సాయంతో పైకి లేపారు. ఆ బీమ్‌లకు రోలర్లను అమర్చి, ఇంటిని కదిలిస్తూ కొత్త ప్రదేశానికి తరలించారు.  ఆ ప్రయాణం దాదాపు 9.7 కిలోమీటర్లు సాగింది. ఇంటిని తరలిస్తున్న అరుదైన దృశ్యాన్ని చూసేందుకు చాలా మంది అక్కడికి చేరుకున్నారు.

Woman Shifts Ancestral Home By Road

Woman Shifts Ancestral Home By Road

పాత ఇంటికి మళ్లీ పూర్వ వైభవం

ప్రస్తుతం జసోండ్రా, జేసన్ ఇంటికి మరమ్మతులు చేయిస్తున్నారు. కాలక్రమేణా ఇంటికి చేసిన ఆధునిక మార్పులను తొలగించి, అసలు ఇంట్లో ఉన్న చెక్క పనులు, పాతకాలపు డిజైన్‌ను తిరిగి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ ఇంటిని కాపాడుకోవడం వెనుక కేవలం పాత భవనంపై ఉన్న ఇష్టంతో పాటు.. ఒకవైపు జసోండ్రా కుటుంబానికి చెందిన ఐదు తరాల జ్ఞాపకాలు.. మరోవైపు జేసన్ తాతయ్య, నానమ్మ కొనుగోలు చేసిన భూమితో ఉన్న అనుబంధం ఉండటం విశేషం. ఒక ఇంటిని నిర్మించడానికి డబ్బు సరిపోతుంది. కానీ తరతరాల జ్ఞాపకాలతో ముడిపడిన ఇంటిని కాపాడుకోవడానికి ప్రేమ, ఓపిక, పట్టుదల అవసరమని ఈ కుటుంబ కథ చెబుతోంది.

Follow Us
ట్రక్కు పైన తరలింపు.. ఆ ఇంటితో ఐదు తరాల అనుబంధం
ట్రక్కు పైన తరలింపు.. ఆ ఇంటితో ఐదు తరాల అనుబంధం
ఇ-కామర్స్‌ డెలివరీ సర్వీస్‌లపై 5% జీఎస్టీ.. కేంద్రం క్లారిటీ!
ఇ-కామర్స్‌ డెలివరీ సర్వీస్‌లపై 5% జీఎస్టీ.. కేంద్రం క్లారిటీ!
తక్కువ ధరకే నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ!
తక్కువ ధరకే నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ!
రాయలసీమ స్పెషల్ ఎల్లిపాయ కారం.. నోటికి రుచినిచ్చే అద్భుతమైన వంటకం
రాయలసీమ స్పెషల్ ఎల్లిపాయ కారం.. నోటికి రుచినిచ్చే అద్భుతమైన వంటకం
ఇండక్షన్‌పై వంట చేస్తున్నారా? ఈ 5 వస్తువుల విషయంలో జాగ్రత్త!
ఇండక్షన్‌పై వంట చేస్తున్నారా? ఈ 5 వస్తువుల విషయంలో జాగ్రత్త!
ఉదయం పొట్ట సాఫీగా అవ్వడం లేదా? వాముతో ఈ చిట్కా ప్రయత్నించండి!
ఉదయం పొట్ట సాఫీగా అవ్వడం లేదా? వాముతో ఈ చిట్కా ప్రయత్నించండి!
మహిళకు క్యాన్సర్.. అంటార్కిటికా వెళ్లొచ్చాక తగ్గిన కణితి సైజు!
మహిళకు క్యాన్సర్.. అంటార్కిటికా వెళ్లొచ్చాక తగ్గిన కణితి సైజు!
నవరాత్రి సమయంలో ఉపవాసాలు ఉండటం సురక్షితమేనా? షుగర్, బీపీ ఉన్నవారు
నవరాత్రి సమయంలో ఉపవాసాలు ఉండటం సురక్షితమేనా? షుగర్, బీపీ ఉన్నవారు
విమానాశ్రయంపై దాడి.. నలుగురు భారతీయులు ఐసీయూలో.. : కేంద్రం
విమానాశ్రయంపై దాడి.. నలుగురు భారతీయులు ఐసీయూలో.. : కేంద్రం
పచ్చి కొబ్బరి తినడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా? నిపుణుల సూచన..
పచ్చి కొబ్బరి తినడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా? నిపుణుల సూచన..