AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

100 కొంటే 400 షేర్లు ఫ్రీ.. లక్షను రూ.10 లక్షలు చేసే స్టాక్.. ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్..

స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు వేదాంత లిమిటెడ్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. త్వరలోనే ఈ కంపెనీ 5 స్వతంత్ర సంస్థలుగా విడిపోనుంది. ఈ డీమెర్జర్ ప్రక్రియకు సంబంధించి రికార్డు తేదీ ఖరారు కావడంతో ఒక్కసారిగా వేదాంత షేరు ధర ఆకాశాన్ని తాకింది. అసలు ఈ విభజన వల్ల ఇన్వెస్టర్లకు వచ్చే లాభమేంటి? ఏప్రిల్ 29 లోపు షేర్లు కొంటే కలిగే ప్రయోజనాలేంటి? అనే విషయాలు తెలుసుకుందాం..

100 కొంటే 400 షేర్లు ఫ్రీ.. లక్షను రూ.10 లక్షలు చేసే స్టాక్.. ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్..
Vedanta Demerger Record Date Set For May 1
Krishna S
|

Updated on: Apr 21, 2026 | 6:09 PM

Share

మైనింగ్ దిగ్గజం వేదాంత లిమిటెడ్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని పునర్వ్యవస్థీకరించే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. డీమెర్జర్ ప్రక్రియకు సంబంధించి కంపెనీ కీలకమైన రికార్డు తేదీని ప్రకటించడంతో, మంగళవారం స్టాక్ మార్కెట్లో ఈ షేరు ఒక్కసారిగా జూలు విదిల్చింది. ట్రేడింగ్ సెషన్‌లో ఈ స్టాక్ రూ.794.90 వద్ద తన జీవితకాల గరిష్ట స్థాయిని తాకి సరికొత్త రికార్డు సృష్టించింది. వేదాంత డీమెర్జర్ కోసం రికార్డు తేదీని 2026 మే 1గా నిర్ణయించారు. అయితే మే 1న మార్కెట్ సెలవు ఉన్నందున, డీమెర్జర్ ప్రయోజనాలు పొందాలనుకునే ఇన్వెస్టర్లు ఏప్రిల్ 29లోపు షేర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

ఒక షేరుకు 4 కొత్త షేర్లు

ఈ డీమెర్జర్ ప్లాన్ ప్రకారం.. వేదాంత లిమిటెడ్ ఐదు విభిన్న కంపెనీలుగా విడిపోనుంది. ప్రస్తుతం మీ దగ్గర వేదాంత లిమిటెడ్ యొక్క ఒక షేరు ఉంటే, విభజన తర్వాత ఏర్పడే ఈ 5 కంపెనీలలో ఒక్కో షేరును పొందుతారు..

  •  వేదాంత లిమిటెడ్
  • వేదాంత అల్యూమినియం
  • వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్
  • వేదాంత పవర్
  • వేదాంత స్టీల్, ఫెర్రస్ మెటీరియల్స్

స్టాక్ మార్కెట్ అంచనాలు.. రూ. 850 టార్గెట్

వేదాంత స్టాక్ గత ఆరు నెలల్లోనే 61 శాతం, గత ఐదేళ్లలో 234 శాతం భారీ రాబడిని ఇచ్చి ఇన్వెస్టర్లలో సరికొత్త జోష్‌ను నింపింది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ అనలిస్ట్ అన్షుల్ జైన్ షేరుకు బై రేటింగ్ ఇచ్చారు.

టార్గెట్ ధర: రూ.850

స్టాప్ లాస్: రూ. 730

గడువు ఎప్పుడు..?

మొత్తం డీమెర్జర్ ప్రక్రియను జూన్ 30 నాటికి పూర్తి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే కొన్ని ప్రభుత్వ అనుమతులు రావాల్సి ఉన్నప్పటికీ, ఇన్వెస్టర్లు మాత్రం దీనిని ఒక సువర్ణ అవకాశంగా భావిస్తున్నారు. 2021లో రూ. 65 వద్ద ఉన్న షేరు ధర నేడు రూ. 800 దరిదాపుల్లో ఉండటం కంపెనీ వృద్ధికి నిదర్శనం.

Follow Us
రామ తులసి, కృష్ణ తులసి మధ్య తేడా ఏమిటి? వాటిని ఎలా గుర్తించాలి?
రామ తులసి, కృష్ణ తులసి మధ్య తేడా ఏమిటి? వాటిని ఎలా గుర్తించాలి?
భలే ట్రిక్‌.. బంగాళాదుంపల పొట్టు తీయటం ఇంత ఈజీనా..?
భలే ట్రిక్‌.. బంగాళాదుంపల పొట్టు తీయటం ఇంత ఈజీనా..?
అల్లు అర్జున్‏కు ఢిల్లీ హైకోర్టు రక్షణ..
అల్లు అర్జున్‏కు ఢిల్లీ హైకోర్టు రక్షణ..
100 కొంటే 400 షేర్లు ఫ్రీ.. లక్షను రూ.10 లక్షలు చేసే స్టాక్..
100 కొంటే 400 షేర్లు ఫ్రీ.. లక్షను రూ.10 లక్షలు చేసే స్టాక్..
ఇప్పటికీ ఆ దృశ్యం నీడలా వెంటాడుతోంది! కొడుకు కోసం బెంగళూరుడాక్టర్
ఇప్పటికీ ఆ దృశ్యం నీడలా వెంటాడుతోంది! కొడుకు కోసం బెంగళూరుడాక్టర్
SRH vs DC Live Score: హ్యాట్రిక్ విక్టరీపై ఎస్‌ఆర్‌హెచ్ గురి..
SRH vs DC Live Score: హ్యాట్రిక్ విక్టరీపై ఎస్‌ఆర్‌హెచ్ గురి..
పోలీస్ ఆఫీసర్‌కే కుళ్లిన మటన్ కీమా పంపిన రెస్టారెంట్.. కట్ చేస్తే
పోలీస్ ఆఫీసర్‌కే కుళ్లిన మటన్ కీమా పంపిన రెస్టారెంట్.. కట్ చేస్తే
యూట్యూబ్‏లో మ్యూజిక్ సెన్సేషన్.. అప్పుడే ఆ పాటలను బయటకు తీస్తా..
యూట్యూబ్‏లో మ్యూజిక్ సెన్సేషన్.. అప్పుడే ఆ పాటలను బయటకు తీస్తా..
గంజి నీటితో గ్లోయింగ్ స్కిన్, సిల్కీ హెయిర్.. మీరు మిస్సవుతున్న..
గంజి నీటితో గ్లోయింగ్ స్కిన్, సిల్కీ హెయిర్.. మీరు మిస్సవుతున్న..
ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ హైవే.. త్వరలోనే పనులు ప్రారంభం
ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ హైవే.. త్వరలోనే పనులు ప్రారంభం