Sai Abhyankkar: నా దగ్గర 1000 పాటలు ఉన్నాయి.. కానీ ఇప్పుడు ఉపయోగించను.. మ్యూజిక్ డైరెక్టర్..
ప్రస్తుతం సోషల్ మీడియా, యూట్యూబ్, ఫిల్మ్ ఇండస్ట్రీలో మారుమోగుతున్న పేరు సాయి అభ్యంకర్. వయసు 21 సంవత్సరాలు మాత్రమే. కానీ ఇప్పుడు యావత్ ఇండియాను తనవైపుకు తిప్పుకున్నాడు. ఇందుకు కారణం అతడు సృష్టించిన పాటలే. భాష అర్థం కాకపోయినా అతడు క్రియేట్ చేసిన పాటలకు చిన్నపెద్ద తేడా లేకుండా స్టెప్పులు వేస్తున్నారు. ఇంతకీ అతడు చెప్పిన ఈ ఆసక్తికర విషయాలు మీరు విన్నారా.. ?

స్తుతం యూట్యూబ్ సెన్సేషన్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు సాయి అభ్యంకర్. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితమే. ఇటీవల అతడు క్రియేట్ చేసిన పాటలు నెట్టింట సంచలనం సృష్టించాయి. గతేడాది విడుదలైన డ్యూడ్ మూవీ సాంగ్స్ కంపోజ్ చేసి ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు. దీంతో అతడికి దక్షిణాదిలో అవకశాలు క్యూ కట్టాయి. ఇప్పుడు అల్లు అర్జున్, సూర్య వంటి హీరోల సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్నాడు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన దగ్గర ప్రస్తుతం వెయ్యికి పైగానే పాటలు ఉన్నాయని .. కానీ వాటిని ఇప్పుడు అసలు ఉపయోగించనని అన్నారు.
Read More Article: Nayanthara : అలాంటి హీరోను ఎక్కడ చూడలేదు.. ఆయనలాంటి డ్యాన్సర్ ఇండియాలోనే లేడు.. టాలీవుడ్ స్టార్ పై నయనతార ప్రశంసలు..
సాయి అభ్యంకర్ మాట్లాడుతూ.. “నేను ఆరో తరగతిలో ఉన్నప్పటి నుంచే మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తున్నాను.. అప్పటి నుంచే పాటలు కంపోజ్ చేస్తున్నాను. ఇప్పటికీ నా దగ్గర 1000కి పైగా పాటలు ఉన్నాయి. కానీ వాటిని ఇప్పుడు అస్సలు ఉపయోగించను. ఆ పాటలను నాకు 60 ఏళ్లు దాటిన తర్వాత బయటకు తీస్తా.. ఇప్పుడు నేను పెద్ద సినిమాలు చేస్తున్నాను. కాబట్టి ఆ పాటలపై ఆధారపడకుండా ఇంకా కొత్త పాటలు కంపోజ్ చేయాలి” అని చెప్పుకొచ్చారు. దీంతో సాయి అభ్యంకర్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.
Read More Article: Trending : ఏం పాట మావ.. 26 ఏళ్లుగా యూట్యూబ్‌లో ట్రెండింగ్.. మళ్లీ మళ్లీ వినాలనిపించే సాంగ్..
సాయి అభ్యంకర్.. తల్లిదండ్రులు ఇద్దరూ ఫేమస్ సింగర్స్. ప్రముఖ సింగర్స్ టిప్పు- హరిణిల కొడుకే ఈ సాయి అభ్యంకర్. సొంతంగా ఆల్బమ్ సాంగ్స్ చేసి ఫేమస్ అయ్యాడు. ప్రస్తుతం తెలుగు, తమిళం భాషలలో స్టార్ హీరోల సినిమాలకు పనిచేస్తున్నాడు.
Read More Article: Actor : అతడికి 57.. ఆమెకు 24.. కట్ చేస్తే.. నాలుగేళ్లుగా ప్రేమలో టాలీవుడ్ విలన్..
Read More Article: Rajamouli : ఆ హీరో నా పక్కన ఉంటే ఏదైనా చేయగలను.. రాజమౌళి కామెంట్స్..
