AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pahalgam Attack: పహల్గామ్ ఉగ్రదాడికి ఏడాది: భద్రతా బలగాలు అప్రమత్తం.. టూరిస్ట్ ప్రదేశాల్లో భద్రత పెంపు

పహిల్గామ్ ఉగ్రదాడి జరిగి ఏడాది కావొస్తోంది. దీంతో అక్కడ టూరిస్ట్ ప్రదేశాల్లో పోలీసులు నిఘా పెంచారు. ఏమైనా హింసాత్మక ఘటనలు మళ్లీ జరిగే అవకాశం ఉందనే హెచ్చరికలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా పోలీస్ అధికారులు భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.

Pahalgam Attack: పహల్గామ్ ఉగ్రదాడికి ఏడాది: భద్రతా బలగాలు అప్రమత్తం.. టూరిస్ట్ ప్రదేశాల్లో భద్రత పెంపు
Police
Venkatrao Lella
|

Updated on: Apr 21, 2026 | 5:26 PM

Share

దేశ చరిత్రలో చీకటి రోజుగా చెప్పుకునే పహల్గామ్ ఉగ్ర కాల్పులు జరిగి ఏప్రిల్ 22తో ఏడాది కావోస్తుంది. రేపటితో ఏడాది అవుతున్న క్రమంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. కాశ్మీర్ లోయలోని పర్యాటక ప్రదేశాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఏవైనా విధ్వంసకర ఘటనలు జరిగే అవకాశం ఉన్న క్రమంలో అన్ని టూరిస్ట్ ప్రదేశాల్లో అదనపు భద్రతను ఏర్పాటు చేశారు. అన్ని భద్రతా సంస్థలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఉన్నతాధికారులు ఈ భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇటీవలే భద్రతా ఏర్పాట్లపై పలు కీలక సమావేశాలు నిర్వహించారు. అనంతరం ఈ చర్యలు చేపట్టారు. సున్నితమైన పర్యాటక ప్రదేశాల చుట్టూ భద్రతను పెంచాలని అధికారులు ఆదేశించారు.

దశలవారీగా ప్రారంభం

గత ఏడాది ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్‌లోని బైసారన్ లోయలో పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 25 మంది పర్యాటకులతో పాటు గుర్రపు స్వారీ చేసే స్ధానిక వ్యక్తి మరణించారు. ఈ ఘటన తర్వాత జమ్మూకశ్మీర్‌లో 50 పర్యాటక ప్రదేశాలను అధికారులు మూసివేయగా.. పర్యాటక రంగానికి తీవ్ర నష్టం వాటిల్లింది. అయితే పరిస్థితి చక్కబట్టాక దశలవారీగా వీటిని తిరిగి తెరిచారు. అయితే పహల్గామ్‌లోని బైసారన్ లోయను మాత్రం ఇప్పటికే తెరవలేదు. అయితే పహల్గామ్ దాడి తర్వాత అధికారులు ప్రతీఒక్కరినీ క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. టూరిజం సర్వీస్ ప్రొవైడర్లను గుర్తించేందుకు క్యూఆర్ బేస్డ్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ప్రవేశపెట్టారు. దీని ద్వారా బయట నుంచి వచ్చే గుర్రపుస్వారీ నిర్వాహకులు, వీధి వ్యాపారులు, దుకాణదారులను సలువుగా గుర్తు పట్టవచ్చు. పోలీసులు ప్రతీఒక్క వ్యక్తి వివరాలు తెలుసుకుని క్యూఆర్ అందిస్తారు.

క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే..

పర్యాటకులు ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆ వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత వివరాలు అన్నీ తెలుస్తాయి. వ్యక్తి పేరు, తల్లిదండ్రుల వివరాలు, అడ్రస్, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, పని చేసే ప్రాంతం, పోలీస్ వెరిఫికేషన్ వంటి వివరాలు తెలుసుకోవచ్చు. అయతే పహల్గామ్‌కు వచ్చే పర్యాటకులు ఉగ్రవాదుల దాడిలో మరణించిన పర్యాటకులకు నివాళులు అర్పిస్తున్నారు. అయితే పహల్గామ్‌లోని మిగతా ప్రాంతాలకు పర్యాటకుల సంఖ్య భారీగా పెరిగింది. ఉగ్రదాడి తర్వాత అక్కడ నివసించే చాలామంది ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. ఇప్పుడిప్పుడే టూరిజం రంగం అక్కడ మళ్లీ పుంజుకుంది. దేశ, విదేశాల నుంచి ఎంతోమంది పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారు. దీంతో మరోసారి ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

Follow Us
కలలలో నెమళ్లు కనిపిస్తే ఏం జరుగుతుంది? శుభమా లేదా అశుభమా? నిజం..
కలలలో నెమళ్లు కనిపిస్తే ఏం జరుగుతుంది? శుభమా లేదా అశుభమా? నిజం..
పహల్గామ్‌లో భద్రత కట్టుదిట్టం.. పోలీసుల నిరంతర నిఘా..
పహల్గామ్‌లో భద్రత కట్టుదిట్టం.. పోలీసుల నిరంతర నిఘా..
కశ్మీర్ అభివృద్ధికి అతిపెద్ద ఎదురుదెబ్బ.. పహల్గామ్ ఉగ్రదాడిపై..
కశ్మీర్ అభివృద్ధికి అతిపెద్ద ఎదురుదెబ్బ.. పహల్గామ్ ఉగ్రదాడిపై..
అప్పుడు ఛీకొట్టారు.. ఇప్పుడు చేతులెత్తి దండం పెట్టారు..
అప్పుడు ఛీకొట్టారు.. ఇప్పుడు చేతులెత్తి దండం పెట్టారు..
16 ఏళ్లైనా తగ్గని డిమాండ్.. థియేటర్లలో ప్రభాస్ క్రేజ్ చూస్తే..
16 ఏళ్లైనా తగ్గని డిమాండ్.. థియేటర్లలో ప్రభాస్ క్రేజ్ చూస్తే..
మేష రాశిలో బుధుడు.. వారి ఆర్థిక సమస్యలకు పరిష్కారం
మేష రాశిలో బుధుడు.. వారి ఆర్థిక సమస్యలకు పరిష్కారం
మీ కాళ్లలో ఈ 4 మార్పులు కనిపిస్తున్నాయా? అయితే డేంజర్
మీ కాళ్లలో ఈ 4 మార్పులు కనిపిస్తున్నాయా? అయితే డేంజర్
ఒక్క జ్యూస్.. వందలాది లాభాలు.. ఉదయాన్నే ఓ గ్లాసు తాగండి చాలు..
ఒక్క జ్యూస్.. వందలాది లాభాలు.. ఉదయాన్నే ఓ గ్లాసు తాగండి చాలు..
బరువు తగ్గాలనుకునే వారికి ఈ 'పంప్కిన్ దోసె' బెస్ట్ ఆప్షన్!
బరువు తగ్గాలనుకునే వారికి ఈ 'పంప్కిన్ దోసె' బెస్ట్ ఆప్షన్!
వార్నీ.. కీబోర్డ్‌లో స్పేస్ బార్ వెనుక ఇంత పెద్ద కథ ఉందా? ఆ సైజు
వార్నీ.. కీబోర్డ్‌లో స్పేస్ బార్ వెనుక ఇంత పెద్ద కథ ఉందా? ఆ సైజు