AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas : ఇది సర్ డార్లింగ్ హవా అంటే.. 16 ఏళ్లైనా తగ్గని క్రేజ్.. మరోసారి థియేటర్లలో సునామీ..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే రాజాసాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన డార్లింగ్.. ఇప్పుడు మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రభాస్ కెరీర్ లో మరోసారి అరుదైన రికార్డ్ క్రియేట్ చేశారు. ఇంతకీ ఏం జరిగింది అనే విషయాలు తెలుసుకుందామా.

Prabhas : ఇది సర్ డార్లింగ్ హవా అంటే.. 16 ఏళ్లైనా తగ్గని క్రేజ్.. మరోసారి థియేటర్లలో సునామీ..
Darling Movie
Rajitha Chanti
|

Updated on: Apr 21, 2026 | 5:11 PM

Share

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే ఈ హీరో కెరీర్‌లో క్లాసిక్ లవ్‌స్టోరీగా నిలిచిన సినిమాల్లో ‘డార్లింగ్’ ఒకటి. అప్పట్లో ఈ సినిమా థియేటర్లలో సంచలనం సృష్టించింది. ఇక ఇప్పుడు ఇదే మూవీ మళ్లీ థియేటర్లలో సందడి చేస్తోంది. కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన పద్నాలుగేళ్ల తర్వాత కూడా బాక్సాఫీస్ వద్ద అదే మేజిక్‌ను రిపీట్ చేస్తూ రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఈ సినిమా రీ-రిలీజ్ సందర్భంగా అడ్వాన్స్ సేల్స్‌లోనే రూ. 2 కోట్ల గ్రాస్ వసూలు చేసి ప్రభాస్ క్రేజ్‌ను మరోసారి నిరూపించింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో ఈ వసూళ్లు అద్దం పడుతున్నాయి. ప్రస్తుత ట్రెండ్‌లో రీ-రిలీజ్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తున్నప్పటికీ, ఒక క్లాసిక్ సినిమాకు ఈ స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ రావడం విశేషం. కేవలం హైదరాబాద్‌లోనే కాకుండా ప్రధాన నగరాల్లోని థియేటర్లు హౌస్‌ఫుల్ అవుతున్నాయి. అటు యూత్, ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఈ సినిమాను మళ్లీ వెండితెరపై చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

Read More Article: Actor : అతడికి 57.. ఆమెకు 24.. కట్ చేస్తే.. నాలుగేళ్లుగా ప్రేమలో టాలీవుడ్ విలన్..

‘డార్లింగ్’ సినిమాలో ప్రభాస్ నటన, స్టైలింగ్, కాజల్ అగర్వాల్‌తో ఉన్న కెమిస్ట్రీ అప్పట్లో సెన్సేషన్ సృష్టించాయి. జీవీ ప్రకాష్ అందించిన సంగీతం ఇప్పటికీ చార్ట్‌బస్టర్‌గా కొనసాగుతోంది. ఈ చిత్రంలోని పాటలు, కామెడీ సీన్లు థియేటర్లలో ప్రేక్షకులకు మళ్ళీ వినోదాన్ని పంచుతున్నాయి. ప్రభాస్ అభిమానులు థియేటర్ల వద్ద పండుగ వాతావరణాన్ని తలపించేలా హంగామా చేస్తున్నారు.

Read More Article: Rajamouli : ఆ హీరో నా పక్కన ఉంటే ఏదైనా చేయగలను.. రాజమౌళి కామెంట్స్..

రీ-రిలీజ్ మార్కెట్‌లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి స్టార్ల సినిమాలకు గతంలో భారీ వసూళ్లు వచ్చాయి. ఇప్పుడు ‘డార్లింగ్’ కూడా ఆ జాబితాలో చేరిపోయింది. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే రూ. 2 కోట్లు వసూలు చేయడంతో, ఫుల్ రన్ ముగిసే సమయానికి ఈ చిత్రం మరింత పెద్ద సంఖ్యను సాధించే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ రికార్డు ప్రభాస్ గ్లోబల్ స్టార్‌గా ఎదిగినా, ఆయన పాత సినిమాలకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని స్పష్టం చేస్తోంది.

Read More Article: Trending : ఏం పాట మావ.. 26 ఏళ్లుగా యూట్యూబ్‌లో ట్రెండింగ్.. మళ్లీ మళ్లీ వినాలనిపించే సాంగ్..

Read More Article: Nayanthara : అలాంటి హీరోను ఎక్కడ చూడలేదు.. ఆయనలాంటి డ్యాన్సర్ ఇండియాలోనే లేడు.. టాలీవుడ్ స్టార్ పై నయనతార ప్రశంసలు..

Follow Us