AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pooja Hegde: మరోసారి రిపీట్ కానున్న ‘ఒక లైలా కోసం’ కాంబినేషన్.. ‘చై’ తో జతకట్టనున్న ‘బుట్టబొమ్మ’..?

Pooja Hegde Again Pair Up With Naga Chaitanya: ‘ఒక లైలా కోసం’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన అందాల తార పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్‌లో బిజీగా హీరోయిన్లలో ఒకరిగా మారారు. వరుస అవకాశాలతో దూసుకెళుతోంది బ్యూటీ...

Pooja Hegde: మరోసారి రిపీట్ కానున్న ‘ఒక లైలా కోసం’ కాంబినేషన్.. ‘చై’ తో జతకట్టనున్న ‘బుట్టబొమ్మ’..?
Narender Vaitla
|

Updated on: Feb 08, 2021 | 6:09 PM

Share

Pooja Hegde Again Pair Up With Naga Chaitanya: ‘ఒక లైలా కోసం’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన అందాల తార పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్‌లో బిజీగా హీరోయిన్లలో ఒకరిగా మారారు. వరుస అవకాశాలతో దూసుకెళుతోంది బ్యూటీ. ఇండస్ట్రీలోని యంగ్, బడా స్టార్ల సరసన నటించే లక్కీ ఛాన్స్ కొట్టేస్తూ ఆకాశమే హద్దుగా దూసుకెళుతోంది. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న ‘రాధే శ్యామ్’తో పాటు.. చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న ‘ఆచార్య’ సినిమాలో గెస్ట్ రోల్‌లో నటించే అవకాశాన్ని కొట్టేసింది. ఇదిలా ఉంటే తాజా సమాచారం తనను ఇండస్ట్రీకి పరిచయం చేసిన నాగచైతన్యతో పూజా మరోసారి జతకట్టనుందా.? అంటే అవుననే సమాధానం వస్తోంది. నాగచైతన్య హీరోగా విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో ‘థ్యాంక్యూ’ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించనుండగా లీడ్ రోల్ కోసం పూజా హెగ్డేను తీసుకునే ప్రయాత్నాల్లో ఉన్నారని సమాచారం. ఈ విషయమై చిత్ర యూనిట్ ఇప్పటికే పూజాను సంప్రదించగా దానికి పూజా కూడా ఓకే చెప్పిందని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Also Read: Aha OTT: తెలుగు డిజిటల్ తెరపై అద్భుతం ‘ఆహా’.. ఏడాది పూర్తి చేసుకున్న తొలి తెలుగు ఓటీటీ..