Prabhas: ప్రభాస్ సినిమాలో నటించాలని ఉందా.? అయితే ఈ అవకాశం మీకోసమే.. ఇంతకీ ఏం చేయాలంటే..
Casting Call For Prabhas-Nag Ashwin Movie: ప్రభాస్ హీరోగా ‘మహానటి’ ఫేమ్ నాగ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో వైజయంతీ మూవీస్ నిర్మిస్తోన్న ఈ సినిమాపై భారీ..

Casting Call For Prabhas-Nag Ashwin Movie: ప్రభాస్ హీరోగా ‘మహానటి’ ఫేమ్ నాగ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో వైజయంతీ మూవీస్ నిర్మిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ విడుదల చేస్తున్న అప్‌డేట్స్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా టైమ్ మిషన్ నేపథ్యంలో రానుందన్న వార్తలు ఆసక్తిని రేకెత్తించాయి.
మరి ఇంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నటించే అవకాశం వచ్చే ఎలా ఉంటుంది.? ఎగిరి గంతేస్తారు కదూ.. తాజాగా చిత్ర యూనిట్ ఇలాంటి ఓ సదవకాశాన్ని అందించింది. ఈ సినిమా కోసం కొత్త నటీనటులు కావాల్సి ఉండగా. చిత్ర యూనిట్ కాస్టింగ్ కాల్ ఇచ్చింది. ఇందులో భాగంగానే సినిమాల్లో నటించాలనే ఆసక్తి ఉన్న ఔత్సాహికుల కోసం ఒక ప్రకటనను జారీ చేశారు. 9 నుంచి 14 ఏళ్లు ఉన్నా అమ్మాయిలకు డ్యాన్స్‌తో పాటు జిమ్మాస్టిక్స్ కూడా తెలిపి ఉండాలని షరతు విధించారు. అంతేకాకుండా 20-35 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న పురుషులకు డ్యాన్సింగ్, మార్షల్ ఆర్ట్స్‌పై పట్టు ఉండాలని చెప్పారు. పైన తెలిపిన స్కిల్స్ మీలో ఉంటే.. వాటికి సంబంధించిన ఓ వీడియోను చిత్రీకరించి.. VYMTALENT@GMAIL.COM కు పంపాలని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ మేరకు వైజయంతి మూవీస్ ట్విట్టర్ వేదికగా ఈ విషయాలను పంచుకుంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణె ప్రభాస్‌కు జోడిగా నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్రలో నటించనున్నాడు.
Let’s Begin.#Prabhas @nagashwin7 @SrBachchan @deepikapadukone@AshwiniDuttCh @SwapnaDuttCh @VyjayanthiFilms #PrabhasNagAshwin pic.twitter.com/v3cfZQnEI4
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) February 8, 2021
Also Read: Pooja Hegde: మరోసారి రిపీట్ కానున్న ‘ఒక లైలా కోసం’ కాంబినేషన్.. ‘చై’ తో జతకట్టనున్న ‘బుట్టబొమ్మ’..?
