Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aha OTT: తెలుగు డిజిటల్ తెరపై అద్భుతం ‘ఆహా’.. ఏడాది పూర్తి చేసుకున్న తొలి తెలుగు ఓటీటీ..

Aha OTT Turns One Year: ఓటీటీ రంగానికి సరికొత్త అర్థం చెబుతూ.. మొదటిసారి ప్రాంతీయ భాషకు పెద్ద పీఠ వేస్తూ వచ్చిందే ‘ఆహా‘ ఓటీటీ. అప్పటి వరకు కేవలం సినిమాలు, వెబ్ సిరీస్‌లకే పరిమితమైన ఓటీటీ రంగంలోకి..

Aha OTT: తెలుగు డిజిటల్ తెరపై అద్భుతం ‘ఆహా’.. ఏడాది పూర్తి చేసుకున్న తొలి తెలుగు ఓటీటీ..
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 08, 2021 | 7:20 PM

Aha OTT Turns One Year: ఓటీటీ రంగానికి సరికొత్త అర్థం చెబుతూ.. మొదటిసారి ప్రాంతీయ భాషకు పెద్ద పీఠ వేస్తూ వచ్చిందే ‘ఆహా‘ ఓటీటీ. అప్పటి వరకు కేవలం సినిమాలు, వెబ్ సిరీస్‌లకే పరిమితమైన ఓటీటీ రంగంలోకి ఇంటర్వ్యూలతో పాటు పలు సరికొత్త కార్యక్రమాలతో దూసుకొచ్చింది ‘ఆహా’ ఓటీటీ. తెలుగు డిజిట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తోన్న ఈ ఓటీటీకి నేటితో (ఫిబ్రవరి 8)తో ఏడాది పూర్తయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆహా యాజమాన్యం సోమవారం సాయంత్రం తొలి ఏడాది వేడులకు నిర్వహిస్తుంది. హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో ఉన్న హోటల్ ఆవాసలో ఈ కార్యక్రమం సాయంత్రం 6 గంటలకు మొదలుకానుంది. ఇక ఏడాది పూర్తి చేసుకుంటున్న తొలి తెలుగు ఓటీటీ ‘ఆహా’ ఇంత తక్కువ సమయంలోనే.. 2 కోట్లకుపైగా డిజిటల్ ప్రేక్షకులను ఆకర్షించడం విశేషం. ఈ ఏడాది కాలంలో ‘ఆహా’లో ఏకంగా.. 1.25 బిలియన్ నిమిషాల కంటెంట్‌ జనరేట్ కావడం మరో విశేషం. ‘ఆహా’ ఈ స్థాయిలో విజయవంతం కావడానికి కారణమైన ప్రేక్షకులకు యాజమాన్యం ధన్యవాదాలు తెలిపింది. ‘ఆహా’ తొలి ఏడాది వేడుకల్లో పాల్గొనండంటూ.. పోస్టర్‌ను విడుదల చేసింది. ‘మీరే ఆహా.. మీదే ఆహా’ అనే వినూత్న నినాదాన్ని ప్రచారం చేస్తోంది ‘ఆహా’ యాజమాన్యం. ఇక ‘ఆహా’ ఓటీటీ ఓవైపు సినిమాలు, వెబ్ సిరీస్‌లతో పాటు మరోవైపు ‘సామ్‌జామ్’ వంటి ప్రత్యేక కార్యక్రమాలతో దూసుకెళుతోంది.

‘ఆహా’ మొదటి వార్షికోత్సవ వేడుక ప్రత్యక్ష ప్రసారం…

Also Read: Rashmika Mandanna: తొలిసారి ప్రైవేట్ ఆల్బమ్‌లో తళుక్కుమన్న రష్మిక.. దేశీ లుక్‌లో అదరగొట్టిన గీతా మేడమ్..