సప్తపదితో జీవితాంతం ఆనందంగా ఉండండి.. విజయ్, రష్మికాకు ప్రధాని మోదీ విషెస్

ఎట్టకేలకు అభిమానుల నిరీక్షణకు తెరపడింది. దక్షిణాదిలో ఇన్నాళ్లు తమ ప్రేమ విషయాన్ని బయటపెట్టకుండా ఉన్న రష్మిక, విజయ్ ఇటీవల తమ పెళ్లిని అధికారికంగా ప్రకటించారు. రష్మిక, విజయ్ వివాహం రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో ఈ నెల 26న జరగనుంది.

సప్తపదితో జీవితాంతం ఆనందంగా ఉండండి.. విజయ్, రష్మికాకు ప్రధాని మోదీ విషెస్
Virosh Wedding

Updated on: Feb 25, 2026 | 11:18 AM

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న మరికొన్ని గంటల్లో వివాహబంధంతో ఒక్కటికాబోతున్నారు. వీరి వివాహం ఉదయ్ పూర్ లో జరగనుంది. రష్మిక, విజయ్ వివాహం రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో ఉన్న ఐటీసీ హోటల్లో గ్రాండ్ గా జరగనుంది. వారి వివాహ వేదిక వద్ద మూడు అంచెల భద్రతను మోహరించినట్లు తెలుస్తోంది. స్థానిక పోలీసులు, హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం, అంతర్జాతీయ భద్రతా మధ్య ఈ వేడుక జరగనుంది. వీరి వివాహానికి కొద్దిమంది అతిధులు మాత్రమే హాజరుకానున్నారు.

దయచేసి ఆ పాపను కాపాడండి.. ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన మంచు మనోజ్..

కాగా అంబానీకి కుటుంబం విజయ్ దేవరకొండ వివాహానికి హాజరు కానున్నారు. ఇప్పయికే అంబానీ ఫ్యామిలీ ఉదయ్ పూర్ కు చేరుకున్నారు. అదేవిధంగా విజయ్‌ దేవరకొండ , రష్మిక వివాహానికి శుభాకాంక్షలు తెలుపుతూ.. ప్రధాని మోదీ లేఖ రాశారు. ఫిబ్రవరి 26న విజయ్‌ – రష్మిక వివాహం జరగనుంది. కాబోయే వధూవరులకు శుభాకాంక్షలుతెలిపారు మోదీ. సప్తపదితో జీవితాంతం స్నేహంతో వర్ధిల్లాలని ఆశీస్సులు అందజేశారు. అలాగే విజయ్‌ – రష్మిక జీవితం అద్భుతంగా ఉండాలని కోరుకుంటూ.. పరస్పరం గౌరవం, ప్రేమ, బాధ్యతలను పంచుకోమని సూచన ఇచ్చారు మోదీ.

Ram Charan: రామ్ చరణ్‌కు లవర్‌గా, తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్.. ఆమె ఎవరంటే

కాగా విజయ్, రష్మిక వివాహానికి కేవలం 100 మంది అతిథులను మాత్రమే ఆహ్వానించారని . అతిథులు, సన్నిహితుల కోసం మార్చి 4న హైదరాబాద్ లో రిసెప్షన్ నిర్వహించనున్నారు. అభిమానుల కోరిక మేరకు తమ పెళ్లి వేడుకకు ‘విరోష్’ అని పేరు పెట్టినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. మొత్తానికి టాలీవుడ్ ప్రేమ పక్షులు ఒక్కటి కానుండడంతో వీరి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

ఇవి కూడా చదవండి

Mrunal Thakur: ఆ హీరో వల్లే నా జీవితం మారిపోయింది.. ఎమోషనల్ అయిన మృణాల్

 

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us