Payal Rajput: ‘ఇండియాలో ఈ టైప్ క్యారెక్టర్ ఎవ్వరు చేయలేదు’.. పాయల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఆర్ఎక్స్ 100 సినిమా సూపర్ హిట్ అవ్వడంతో పాయల్ కు వరుస అవకాశాలు వచ్చాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించింది పాయల్. వెంకటేష్ నటించిన వెంకీ మామ, అలాగే రవితేజకు జోడీగా డిస్కో రాజా లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది పాయల్. కానీ ఈ ముద్దుగుమ్మకు ఆశించిన స్థాయిలో సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. అలాగే డిజిటల్ లో కూడా అడుగు పెట్టింది పాయల్.

నటనతో పాటు అందంతోనూ కవ్వించి ప్రేక్షకులను మెప్పించింది పాయల్ రాజ్ పుత్. ఆర్ఎక్స్ 100 సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ తొలి సినిమాతోనే ఆడియాన్స్ ను ఫిదా చేసింది. రొమాంటిక్, బోల్డ్ సీన్స్ లో రెచ్చిపోయి నటించి ఆకట్టుకుంది. ఆర్ఎక్స్ 100 సినిమా సూపర్ హిట్ అవ్వడంతో పాయల్ కు వరుస అవకాశాలు వచ్చాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించింది పాయల్. వెంకటేష్ నటించిన వెంకీ మామ, అలాగే రవితేజకు జోడీగా డిస్కో రాజా లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది పాయల్. కానీ ఈ ముద్దుగుమ్మకు ఆశించిన స్థాయిలో సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. అలాగే డిజిటల్ లో కూడా అడుగు పెట్టింది పాయల్. అనగనగా ఓ అతిథి అనే సినిమాలో నటించింది ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయ్యింది.
ఇక ఇప్పుడు మంగళవారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్ ఎక్స్ 100 సినిమాను తెరకెక్కించిన అజయ్ భూపతి ఈ సినిమాను కూడా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా హర్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది. ఇటీవలే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ సినిమా పై అంచనాలతో పాటు భయాన్ని కూడా కలిగించింది. మంగళవారం సినిమా శుక్రవారం విడుదల కానుంది. 17న గ్రాండ్ గా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.
మంగళవారం సినిమా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో సినిమా విడుదలవుతోంది. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా పాయల్ రాజ్ పుత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ సినిమాలో ఛాన్స్ కోసం నేనే దర్శకుడు అజయ్ భూపతి వెంటపడ్డాను . ఒక్క ఛాన్స్ సార్, ఒక్క ఛాన్స్ అంటూ ఆయనకు రోజూ ఫోన్ చేశాను. మంచి సినిమా చేస్తే తప్పకుండా చెప్తా అన్నారు. చిన్న చిన్న పాత్రలకు నన్ను తీసుకోవడం కరెక్ట్ కాదు అని అజయ్ కి తెలుసు. నా టాలెంట్ ఏంటో అజయ్ కు తెలుసు. ఆయన నుంచి ఫోన్ రాగానే ఓకే చేశా. ఈ సినిమా నాకు టర్నింగ్ పాయింట్ అవుతుంది. మంచి కం బ్యాక్ అవుతుందని ఆశిస్తున్నా అని తెలిపింది పాయల్. ఇండియాలో ఈ టైపు క్యారెక్టర్, కథతో ఎవరూ సినిమా చేయలేదు అని తెలిపింది పాయల్.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
