వకీల్ సాబ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్..! రేపు సాయంత్రం 6 గంటలకు.. టీవీ9లో తప్పక చూడండి..
Vakeel Saab Movie Pre Release Event : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన కొత్త సినిమా వకీల్ సాబ్.. ఈ చిత్రం ప్రి రిలీజ్ ఈవెంట్ రేపు ఆరు గంటలకు శిల్ప
Vakeel Saab Movie Pre Release Event : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన కొత్త సినిమా వకీల్ సాబ్.. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు ఆరు గంటలకు శిల్ప కళావేదికలో జరగనుంది. ఈ కార్యక్రమాన్ని టీవీ9 ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. కాగా ఈ కార్యక్రమానికి సినిమాలో నటించిన ఆర్టిస్టులతో పాటు సినిమా దర్శక, నిర్మాతలు తదితరులు హాజరవుతారు. ఇదిలా ఉంటే ఈ సినిమాను ఏప్రిల్ 9 విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
పవన్ కల్యాణ్ జనసేన పార్టీ ప్రారంభించిన తర్వాత క్రియా శీలక రాజకీయాలలో బిజీగా మారారు. ఎన్నికలలో పాల్గొంటూ పర్యటనలు చేశారు. దీంతో కొన్ని రోజులు సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. అయితే చాలా రోజుల తర్వాత పవన్ వకీల్ సాబ్ తో అభిమానుల ముందుకు వస్తున్నారు. ‘అజ్ఞాతవాసి’ చిత్రం తర్వాత ఆయన నేరుగా మరో సినిమా చేయలేదు. దీంతో కొన్ని రోజులుగా పవన్ కల్యాణ్ అభిమానులు కూడా నిరాశలో ఉన్నారు. ఇప్పుడు వకీల్ సాబ్‌తో ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు..
ఇక సినిమా విషయాని కొస్తే కథ పరంగా ఇది ఉమెన్ ఎంపవర్ మెంట్‌కి సంబంధించింది. ఇప్పటికే టీజర్, టైలర్ యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి. అంతేకాకుండా లాయర్ పాత్రలో పవన్ కల్యాణ్ తన విశ్వరూపం చూపించడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా హిందీ చిత్రం పింక్ సినిమాకి రిమేక్.. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్సన్ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రుతి హాసన్ నటిస్తుండగా ప్రధాన పాత్రలో నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల నటించారు.