పవన్ టార్గెట్ 5 సినిమాలు..!
పవర్‌స్టార్ ఈ పేరులోనే ఓ వైబ్ ఉంది. ఆయన స్క్రీన్‌పై కనిపిస్తే ఫ్యాన్స్‌కి పూనకాలు స్టార్ట్ అవుతాయ్. తెలగు చిత్ర సీమలో అనతికాలంలోనే ఊహించని స్టార్ డమ్ సొంతం చేసుకున్న పవన్ కల్యాణ్..ఊహించని విధంగా సినిమాలకు కామా పెట్టి రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. ఆయన ఇండస్ట్రీకి దూరమయ్యి దాదాపు మూడేళ్లు అవుతుంది. ఎవ్వరూ ఊహించని విధంగా పవన్ ‘పింక్’ రీమేక్‌తో వెండితెరపైకి పునరాగమనం చేయబోతున్నారు. అదొక్కటి కమిట్ అయ్యారు కాబట్టి చేస్తున్నారు అంతా. కానీ ఊహించని విధంగా […]
పవర్‌స్టార్ ఈ పేరులోనే ఓ వైబ్ ఉంది. ఆయన స్క్రీన్‌పై కనిపిస్తే ఫ్యాన్స్‌కి పూనకాలు స్టార్ట్ అవుతాయ్. తెలగు చిత్ర సీమలో అనతికాలంలోనే ఊహించని స్టార్ డమ్ సొంతం చేసుకున్న పవన్ కల్యాణ్..ఊహించని విధంగా సినిమాలకు కామా పెట్టి రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. ఆయన ఇండస్ట్రీకి దూరమయ్యి దాదాపు మూడేళ్లు అవుతుంది. ఎవ్వరూ ఊహించని విధంగా పవన్ ‘పింక్’ రీమేక్‌తో వెండితెరపైకి పునరాగమనం చేయబోతున్నారు. అదొక్కటి కమిట్ అయ్యారు కాబట్టి చేస్తున్నారు అంతా. కానీ ఊహించని విధంగా క్రిష్‌ని ఓ మూవీ, హరీష్ శంకర్‌తో మరో మూవీ ఎనౌన్స్ చేసి ఫ్యాన్స్‌కు పండుగ తీసుకొచ్చారు. ఈ మూడు మాత్రమే కాదు..మరో రెండు ప్రాజెక్ట్స్‌కు కూడా పవన్ ఓకే చెప్పినట్టు ఫిల్మ్ నగర్ నుంచి సమాచారం అందుతోంది.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థలతో పవన్ మూవీస్ కమిటయ్యాడట. హారిక సంస్థ నిర్మించనున్న సినిమాకి త్రివిక్రమ్ దర్శకుడని, ఎస్ఆర్టీ బ్యానర్‌లో మూవీ కొత్త డైరెక్టర్ పనిచేయనున్నారని టాక్. ఇక ఆల్ టైమ్ మాస్ డైరెక్టర్ పూరి జగన్నథ్ పవన్ కోసం ఓ సాలిడ్ కథ సిద్దం చేసి..అపాయింట్‌మెంట్ కోసం ఎదురు చూస్తున్నారట. ఏది ఏమైనా పవన్ వరసబెట్టి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుండటంతో ఫ్యాన్స్ పుల్ జోష్‌లో ఉన్నారు.