హీరో నిఖిల్ పెళ్లి కన్ఫర్మ్.. ప్రేయసి ఎవరంటే!

టాలీవుడ్‌లో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు హీరో నిఖిల్. కొత్త కథలను ఎంచుకుంటూ.. సినిమాలు తీస్తూ.. అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు. హ్యాపీడేస్ సినిమాతో పరిచమైన తరువాత వరుస సినిమాలు చేస్తూ.. పలు విజయాలను ఖాతాలో వేసుకున్నాడు. రీసెంట్‌గా అర్జున్ సురవరం లాంటి బ్లాక్ బస్టర్ మూవీతో ఊపు మీద ఉన్న హీరో నిఖిల్ త్వరలో పెళ్లి కొడుకు కానున్నాడు. భీమవరం అమ్మాయిని గోవాలో ప్రొపొజ్ చేసి తనని మెప్పించి పెద్దల్ని ఒప్పించి.. ఎక్కడైతే ప్రొపొజ్ […]

హీరో నిఖిల్ పెళ్లి కన్ఫర్మ్.. ప్రేయసి ఎవరంటే!

టాలీవుడ్‌లో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు హీరో నిఖిల్. కొత్త కథలను ఎంచుకుంటూ.. సినిమాలు తీస్తూ.. అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు. హ్యాపీడేస్ సినిమాతో పరిచమైన తరువాత వరుస సినిమాలు చేస్తూ.. పలు విజయాలను ఖాతాలో వేసుకున్నాడు. రీసెంట్‌గా అర్జున్ సురవరం లాంటి బ్లాక్ బస్టర్ మూవీతో ఊపు మీద ఉన్న హీరో నిఖిల్ త్వరలో పెళ్లి కొడుకు కానున్నాడు. భీమవరం అమ్మాయిని గోవాలో ప్రొపొజ్ చేసి తనని మెప్పించి పెద్దల్ని ఒప్పించి.. ఎక్కడైతే ప్రొపొజ్ చేసాడో అదే గోవాలో నిశ్చితార్థం చేసుకున్నాడు.

వివరాల్లోకి వెళ్తే.. డాక్టర్ పల్లవి వర్మని ప్రేమించిన నిఖిల్ అందరి సమ్మతితో ప్రేమ వివాహం చేసుకోబోతున్నాడు. గోవాలో నిన్న(1st feb) పెద్దల సమక్షంలో నిశ్చితార్థం జరుపుకున్నాడు. ఏప్రిల్ 16న పెళ్లికి రెడీ అవుతున్నాడు. అర్జున్ సురవరం లాంటి బ్లాక్ బస్టర్ తరువాత నిఖిల్ పెళ్లి కొడుకు కావటం శుభసూచికం. కాగా ఈ విషయాన్ని తానే స్వయంగా ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు.

Published On - 6:28 pm, Sun, 2 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu