జాతర నేపథ్యంలో.. మేడారానికి పోటెత్తిన భక్తులు

వరంగల్‌ జిల్లాలోని మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు భక్త జనసందోహం పోటెత్తింది. ఆదివారం కావడంతో జాతరకు ముందే సరిహద్దు జిల్లాలైన హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ నుండి భక్తులు మేడారంకు చేరుకున్నారు. జంపన్న వాగులో పవిత్ర స్నానాలు ఆచరించారు. వనదేవతలు సమ్మక్క.. సారలమ్మలను దర్శించుకొని గద్దె వద్ద మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో మేడారం మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్‌ అయింది. జాతర సందర్భంగా కోట్లాది మంది ప్రజలు మేడారంను సందర్శించి మొక్కులు చెల్లించుకుంటారు. ఫిబ్రవరి 5 నుండి […]

జాతర నేపథ్యంలో.. మేడారానికి పోటెత్తిన భక్తులు

వరంగల్‌ జిల్లాలోని మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు భక్త జనసందోహం పోటెత్తింది. ఆదివారం కావడంతో జాతరకు ముందే సరిహద్దు జిల్లాలైన హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ నుండి భక్తులు మేడారంకు చేరుకున్నారు. జంపన్న వాగులో పవిత్ర స్నానాలు ఆచరించారు. వనదేవతలు సమ్మక్క.. సారలమ్మలను దర్శించుకొని గద్దె వద్ద మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో మేడారం మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్‌ అయింది. జాతర సందర్భంగా కోట్లాది మంది ప్రజలు మేడారంను సందర్శించి మొక్కులు చెల్లించుకుంటారు. ఫిబ్రవరి 5 నుండి ఫిబ్రవరి 8 వరకు మేడారం జాతర జరుగనుంది.

మొదటిరోజు: ఫిబ్రవరి 5న బుధవారం నాడు సారలమ్మ, పగిదిద్దరాజు, గోవిందరాజులు గద్దెలకు చేరుకుంటారు. రెండోవరోజు: ఫిబ్రవరి 6న గురువారం నాడు సమ్మక్క గద్దెకు చేరుతుంది. మూడవరోజు: ఫిబ్రవరి 7న శుక్రవారం నాడు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. నాల్గువరోజు: ఫిబ్రవరి 8న శనివారం దేవతల వన ప్రవేశం ఉంటుంది.

రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్ సమ్మక్క సారలమ్మలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Click on your DTH Provider to Add TV9 Telugu