AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ రోజు చాలా ప్రత్యేకం.. ఇలా జరగాలంటే మరో వందేళ్లు ఆగాల్సిందే..!

ఈ రోజు(ఆదివారం) ఫిబ్రవరి 2, 2020 చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ తేదీ ఓ ఎనిమిదంకెల పాలిండ్రోమ్ సంఖ్య. అంటే ముందు నుంచి చదివినా, వెనక నుంచి చదివినా ఒకేలా ఉండే సంఖ్య అన్నమాట. ఈరోజు తేదీ.. 02-02-2020ను ఎటునుంచి చదివినా ఒకేలా ఉంటుంది.  ఇలాంటి వింత 909ఏళ్ల క్రితం ఓసారి జరిగింది. అప్పుడు 11-11-1111న ఇలాంటి పాలిండ్రోమ్ సంఖ్య తేదీగా వచ్చింది. మళ్లీ ఇలాంటి వింతను మన జీవితాల్లో చూడలేం. ఎందుకంటే మరోసారి ఇలాంటి పాలిండ్రోమ్ […]

ఈ రోజు చాలా ప్రత్యేకం.. ఇలా జరగాలంటే మరో వందేళ్లు ఆగాల్సిందే..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 02, 2020 | 10:44 PM

Share

ఈ రోజు(ఆదివారం) ఫిబ్రవరి 2, 2020 చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ తేదీ ఓ ఎనిమిదంకెల పాలిండ్రోమ్ సంఖ్య. అంటే ముందు నుంచి చదివినా, వెనక నుంచి చదివినా ఒకేలా ఉండే సంఖ్య అన్నమాట. ఈరోజు తేదీ.. 02-02-2020ను ఎటునుంచి చదివినా ఒకేలా ఉంటుంది.  ఇలాంటి వింత 909ఏళ్ల క్రితం ఓసారి జరిగింది. అప్పుడు 11-11-1111న ఇలాంటి పాలిండ్రోమ్ సంఖ్య తేదీగా వచ్చింది. మళ్లీ ఇలాంటి వింతను మన జీవితాల్లో చూడలేం. ఎందుకంటే మరోసారి ఇలాంటి పాలిండ్రోమ్ తేదీ రావాలంటే దాదాపు 1000ఏళ్లు వేచిచూడాలి మరి. తదుపరి పాలిండ్రోమ్ తేదీ 101 సంవత్సరాల తరువాత 12/12/2121 న జరుగుతుంది.