కోహ్లీని కూడా వెనక్కి నెట్టిన హిట్ మ్యాన్…రికార్డులు కుమ్మేస్తున్నాడుగా..

న్యూజిలాండ్‌తో భారత్ టీ20 సిరీస్ ముగిసింది. చివరిదైన 5వ మ్యాచ్‌లో కూడా నెగ్గిన ఇండియా కివీస్‌ను వైట్ వాష్ చేసింది. విరాట్ రెస్ట్ తీసుకోవడంతో కెప్టెన్‌గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ..నాయకుడిగానే కాదు..బ్యాట్స్‌మెన్‌గా కూడా అదరగొట్టాడు. 41 బంతుల్లో 60 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఇందులో 3 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఈ తాజా హాఫ్ సెంచరీతో..రన్ మెషీన్ విరాట్ కోహ్లీ పేరిట ఉన్న వరల్డ్ రికార్డును బ్రేక్ చేశాడు రోహిత్. టీ20లలో […]

కోహ్లీని కూడా వెనక్కి నెట్టిన హిట్ మ్యాన్...రికార్డులు కుమ్మేస్తున్నాడుగా..

న్యూజిలాండ్‌తో భారత్ టీ20 సిరీస్ ముగిసింది. చివరిదైన 5వ మ్యాచ్‌లో కూడా నెగ్గిన ఇండియా కివీస్‌ను వైట్ వాష్ చేసింది. విరాట్ రెస్ట్ తీసుకోవడంతో కెప్టెన్‌గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ..నాయకుడిగానే కాదు..బ్యాట్స్‌మెన్‌గా కూడా అదరగొట్టాడు. 41 బంతుల్లో 60 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఇందులో 3 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఈ తాజా హాఫ్ సెంచరీతో..రన్ మెషీన్ విరాట్ కోహ్లీ పేరిట ఉన్న వరల్డ్ రికార్డును బ్రేక్ చేశాడు రోహిత్. టీ20లలో ఇప్పటి వరకు అత్యధిక 50+ స్కోర్లు  చేసిన రికార్డు విరాట్ పేరుతో ఉంది. దానికి  నేటి మ్యాచ్‌తో హిట్ మ్యాన్ చరమగీతం పాడాడు.

టీ20 ఫార్మాట్‌లో ఇప్పటిదాకా 108 మ్యాచ్‌లాడిన రోహిత్ శర్మ 25 సార్లు.. 50 లేదా అంతకన్నా ఎక్కువ పరుగులు చేశాడు. హిట్ మ్యాన్ కెరీర్‌లో 20 హాఫ్ సెంచరీలు, నాలుగు శతకాలు ఉన్నాయి. తాజాగా ఈ విషయంలో రెండు స్థానానికి పడిపోయిన కోహ్లీ.. 24 సార్లు.. 50 లేదా అంతకంటే ఎక్కువ స్కోర్లు నమోదు చేశాడు. కాగా ఇప్పటివరకు కోహ్లీ 82 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. వీటిలో 24 అర్ధసెంచరీలు సాధించగా.. ఒక్క శతకం కూాడా బాదలేకపోయాడు. ఇక ఒకరి రికార్డులు ఒకరు బీట్ చేసుకోవడం మన భారత్ కెప్టెన్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలకు అలవాటుగా మారింది.

Published On - 5:44 pm, Sun, 2 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu