యూపీలో దారుణం.. హిందూ మహా సభ అధ్యక్షుని కాల్చివేత
అఖిలభారతీయ హిందూ మహాసభ యూపీ శాఖ అధ్యక్షుడు రంజిత్ బచ్చన్ ను ఆదివారం దుండగులు కాల్చి చంపారు. లక్నోలోని హజ్రత్ గంజ్ ప్రాంతంలో మార్నింగ్ వాక్ చేస్తున్న ఆయనపై అతి సమీపం నుంచి వారు కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలకు గురైన ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మరణించినట్టు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనలో రంజిత్ సోదరుడు కూడా గాయపడ్డారు. రంజిత్ హత్య ఘటన నేపథ్యంలో యూపీ ప్రభుత్వం నలుగురు పోలీసులను సస్పెండ్ చేసింది. […]
అఖిలభారతీయ హిందూ మహాసభ యూపీ శాఖ అధ్యక్షుడు రంజిత్ బచ్చన్ ను ఆదివారం దుండగులు కాల్చి చంపారు. లక్నోలోని హజ్రత్ గంజ్ ప్రాంతంలో మార్నింగ్ వాక్ చేస్తున్న ఆయనపై అతి సమీపం నుంచి వారు కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలకు గురైన ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మరణించినట్టు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనలో రంజిత్ సోదరుడు కూడా గాయపడ్డారు. రంజిత్ హత్య ఘటన నేపథ్యంలో యూపీ ప్రభుత్వం నలుగురు పోలీసులను సస్పెండ్ చేసింది. కొంతకాలంగా రంజిత్ కు గుర్తు తెలియని వ్యక్తులనుంచి బెదిరింపు కాల్స్ అందుతున్నట్టు తెలిసింది.
నాలుగు నెలల్లో ఒక హిందూ నేత హత్య జరగడం ఇది రెండో సారి. గత అక్టోబరు 18 న హిందూ సమాజ్ పార్టీ అధ్యక్షుడు కమలేష్ తివారీని ఆయన కార్యాలయంలోనే కాల్చి చంపారు. ఓ ఫేస్ బుక్ ఐడీ సృష్టించి.. ఆయనతో స్నేహం నటించిన ఇద్దరు వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడ్డారు. యూపీలో రంజిత్ బచ్ఛన్.. హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. ఆయన హత్య యూపీలో సంచలనం రేపింది. దుండగులను పట్టుకునేందుకు పోలీసుఅధికారులు ప్రత్యేక బృందాలను నియమించారు.