Pawan Kalyan: తమ్ముడి ప్రమాణ స్వీకారం వేళ.. అలా చూస్తుండిపోయిన అన్నయ్య.. భావోద్వేగానికి గురైన అన్నా లెజనోవా..

కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ పవన్ ప్రమాణ స్వీకారం చేస్తుండగా.. ఆయన భార్య అన్నా లెజనోవా ముఖం సంతోషంతో వెలిగిపోయింది. భర్త ప్రమాణ స్వీకారోత్సవాన్ని వీడియో తీస్తూ ఉప్పోంగిపోయింది. జనాల మధ్యలో కూర్చున్న అన్నా లెజనోవా పవన్ ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఆనందంతో తన ఫోన్ లో వీడియో తీసుకుంది.

Pawan Kalyan: తమ్ముడి ప్రమాణ స్వీకారం వేళ.. అలా చూస్తుండిపోయిన అన్నయ్య.. భావోద్వేగానికి గురైన అన్నా లెజనోవా..
Pawan Kalyan, Chiranjeevi
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 12, 2024 | 2:02 PM

ఆంధ్రప్రదేశ్ మంత్రిగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రిగా ప్రమాణం చేస్తున్న సమయంలోనే సభా ప్రాంగణం అంతా దద్దరిల్లిపోయింది. ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రాగా.. తమ అభిమాన హీరో ప్రమాణ స్వీకారం చూసేందుకు పెద్ద ఎత్తున మెగా ఫ్యాన్స్ తరలివచ్చారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ పవన్ ప్రమాణ స్వీకారం చేస్తుండగా.. ఆయన భార్య అన్నా లెజనోవా ముఖం సంతోషంతో వెలిగిపోయింది. భర్త ప్రమాణ స్వీకారోత్సవాన్ని వీడియో తీస్తూ ఉప్పోంగిపోయింది. జనాల మధ్యలో కూర్చున్న అన్నా లెజనోవా పవన్ ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఆనందంతో తన ఫోన్ లో వీడియో తీసుకుంది.

ఇక చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి స్టేట్ గెస్ట్ గా వచ్చిన చిరు వేదికపైనే కూర్చున్నారు. పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తున్నంతసేపు తమ్ముడిని చూస్తూ ఉండిపోయారు. పవన్ ను చూస్తూ చిరు ఆనందంతో పులకరించిపోగా.. పక్కనే ఉన్న సూపర్ స్టార్ రజినీకాంత్ చిరును అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతుండగా..చిరు, పవన్ అనుబంధం చూసి ఎమోషనల్ అవుతున్నారు మెగా ఫ్యాన్స్. అన్నదమ్ముల ప్రేమకు అసలైన సాక్ష్యం చిరు, పవన్ అంటూ అభినందిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం మొత్తం కన్నుల పండగగా జరిగింది. ఒకే వేదికపై నరేంద్రమోదీ, పవన్ కళ్యాణ్, చిరంజీవి, రజినీకాంత్, బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు ఇలా అందరిని ఒక్కచోటు చూసి అభిమానులు, జనసేన, టీడీపీ పార్టీ కార్యకర్తలు, మెగా ఫ్యాన్స్, మెగా ఫ్యామిలీ ఆనందంతో పొంగిపోతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.