Bheemla Nayak: ఓటీటీ ఎంట్రీకి రెడీ అవుతున్న భీమ్లానాయక్.. స్ట్రీమింగ్ అప్పటినుంచేనా.?
భీమ్లా నాయక్ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టారు పవన్ అండ్ రానా..! ఈగోకు లోగో లాంటి క్యారెక్టర్లో.. బులుపుకు బ్రాండ్ అంబాసిడర్ లాంటి ఆటిట్యూడ్‌తో ఈ ఇద్దరు స్టార్లు సినిమాలో చిన్న పాటి యుద్ధమే చేశారు..
Bheemla Nayak: భీమ్లా నాయక్ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టారు పవన్ అండ్ రానా..! ఈగోకు లోగో లాంటి క్యారెక్టర్లో.. బులుపుకు బ్రాండ్ అంబాసిడర్ లాంటి ఆటిట్యూడ్‌తో ఈ ఇద్దరు స్టార్లు సినిమాలో చిన్న పాటి యుద్ధమే చేశారు.. మనల్ని మరిచిపోని విధంగా ఎంటర్‌టైన్ చేశారు. సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన భీమ్లానాయక్ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే తోపాటు డైలాగ్స్ రచించారు. పవన్ కళ్యాణ్, రానా ఇద్దరు పోటీ పడి మరీ నటించారు. ఇక ఇప్పటికే 100 కోట్ల క్లబ్‌లో చేరిపోయిన ఈ ఫిల్మ్ తాజాగా హిందీలోనూ రిలీజ్ కు రెడీ అయిపోయింది. రీసెంట్ గా ఈ మూవీ హిందీ ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇప్పటికే మన సినిమాలకు బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు భీమ్లానాయక్ సినిమా కూడా అక్కడి ప్రేక్షకులను మెప్పిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్న చిత్రయూనిట్. ఇదిలా ఉంటే భీమ్లానాయక్ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేయడానికి రెడీ అవుతుందనితెలుస్తుంది.
ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఓటీటీ రిలీజ్ హక్కుల్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ `ఆహా` సొంతం చేసుకుందని టాక్ వినిపిస్తుంది. అయితే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తో కలిసి `భీమ్లానాయక్` ఓటీటీ రిలీజ్ హక్కుల్ని `ఆహా` సొంతం చేసుకుందట. ఇదిలా ఉంటే మార్చిలోనే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. భీమ్లానాయక్` ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఆహా- డిస్నీ ప్లస్ హాట్ స్టార్ భారి మొత్తం చెల్లించి సొంతం చేసుకున్నాయని ప్రచారం జరుగుతుంది. మరి ఈవార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.