Pawan Kalyan: ‘ఇకపై గాజు గ్లాజులోనే టీ తాగుతా’.. పవన్ కల్యాణ్ విజయంపై అంజనమ్మ రియాక్షన్.. వీడియో

|

Jun 05, 2024 | 8:02 AM

'పడిన చోటే నిలబడ్డాడు' అన్న మాటను నిజం చేస్తూ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధిపతి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ భారీ విజయం సాధించారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన ఆయన ఈసారి మాత్రం బంపర్ మెజారిటీతో గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టనున్నారు

Pawan Kalyan: ఇకపై గాజు గ్లాజులోనే టీ తాగుతా.. పవన్ కల్యాణ్ విజయంపై అంజనమ్మ రియాక్షన్.. వీడియో
Pawan Kalyan, Anjana Devi
Follow us on

‘పడిన చోటే నిలబడ్డాడు’ అన్న మాటను నిజం చేస్తూ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధిపతి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ భారీ విజయం సాధించారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన ఆయన ఈసారి మాత్రం బంపర్ మెజారిటీతో గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టనున్నారు. అలాగే పవన్ నేతృత్వంలో గాజు గ్లాసు గుర్తుపై పోటీచేసిన 21 మంది అభ్యర్థులు కూడా ఘన విజయం సాధించారు. ఎంపీ సీట్లలో కూడా పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ జనసేన గెలిచింది. మొత్తానికి 100 శాతం స్ట్రైక్ రేట్ తో జనసేన చరిత్ర సృష్టించింది. ఇక పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి ఏకంగా 70 వేల మెజారిటీతో గెలుపొందిన పవన్ కల్యాణ్ కు సినీ పరిశ్రమ నుంచి అభినందనలు వెల్లువెతుతున్నాయి. చిరంజీవి, చరణ్, సాయి ధరమ్ తేజ్, అల్లు అర్జున్, ఉపాసన, నాగబాబు, పవన్ సోదరీమణులు.. ఇలా మెగా ఫ్యామిలీ అంతా సెలబ్రేషన్స్ లో మునిగిపోయారు. పవన్ కు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తల్లి అంజనా దేవి పవన్ గెలుపుపై స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో అంజనా దేవి మాట్లాడుతూ.. ‘ ఇవాళ మా అబ్బాయి రాజకీయాల్లో విజయం సాధించాడు. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వాడు పడ్డ కష్టానికి భగవంతుడు మంచి ఫలితమే ఇచ్చాడు. ఈ రోజు నుంచి నేను గాజు గ్లాస్ లోనే టీ తాగుతాను’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. జనసేన శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు, మెగా ఫ్యాన్స్ ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

మెగాస్టార్ చిరంజీవి ట్వీట్..

అల్లు అర్జున్ రియాక్షన్..