pawan kalyan : అనుకున్న సమయానికి పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందా..? టెన్షన్ లో ఫ్యాన్స్
కరోనా ఎఫెక్ట్‌తో మరోసారి ఇండస్ట్రీలో వాయిదా పర్వం మొదలైంది. షూటింగ్‌లకు కూడా బ్రేక్ పడింది. దీంతో భారీ చిత్రాలు మరింత ఆలస్యం అవుతున్నాయన్న టాక్ వినిపిస్తోంది.
pawan kalyan : కరోనా ఎఫెక్ట్‌తో మరోసారి ఇండస్ట్రీలో వాయిదా పర్వం మొదలైంది. షూటింగ్‌లకు కూడా బ్రేక్ పడింది. దీంతో భారీ చిత్రాలు మరింత ఆలస్యం అవుతున్నాయన్న టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ తొలిసారిగా చేస్తున్న పీరియాడిక్ డ్రామా హరి హర వీరమల్లు విషయంలో ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు మూడేళ్లు తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి వకీల్ సాబ్ గా అదరగొట్టారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. మొదటి షో నుంచే ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా తర్వాత క్రిష్ డైరెక్షన్ లో హరహర వీరమల్లు సినిమా చేస్తున్నాడు. పవన్ కెరియర్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.
ఇటీవల మోషన్ టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్ ఈ మూవీ 2022 సంక్రాంతికి రిలీజ్ అంటూ ఎనౌన్స్ చేశారు. కానీ ప్రజెంట్ సిచ్యుయేషన్‌లో అది సాధ్యమేనా అన్న డౌట్స్ రెయిజ్ అవుతున్నాయి. ఇప్పటికే కరోనా బారిన పడ్డ పవన్ కల్యాణ్ కొద్ది రోజులు షూటింగ్‌లకు దూరంగా ఉంటారన్న టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో సంక్రాంతి నాటికి ఈ భారీ చిత్రం రెడీ అవుతుందా..?
ఈ అనుమానాలకు ఫుల్ స్టాప్ పెట్టేశారు నిర్మాత ఏఎం రత్నం. డైరెక్టర్ క్రిష్ పక్కా ప్లానింగ్‌తో ఉన్నారన్న రత్నం… ఎట్టి పరిస్థితుల్లో సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుందని చెప్పారు. మ్యాగ్జిమమ్ షూటింగ్ కంప్లీట్ అయ్యిందన్న నిర్మాత.. మిగతా వర్క్ కూడా ఇన్ టైంలో పూర్తి చేస్తామని కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు. సో.. పవర్ స్టార్ ఫ్యాన్స్ బీ రెడీ.
మరిన్ని ఇక్కడ చదవండి :